📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

TGS PDCL: ప్రతి బుధవారం టిజిఎస్ పిడిసిఎల్ వినియోగదారులతో ముఖాముఖి

Author Icon By Sharanya
Updated: July 1, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెరుగైన సేవలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు

డిటిఆర్ స్థాయిలో నిరంతరం సరఫరా పర్యవేక్షణ

టిజిఎస్ పిడిసిఎల్ ముషారఫ్ ఫరూఖీ

హైదరాబాద్: విద్యుత్ అధికారులు వినియోగదారులకు నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రతి బుధవారం బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమాలు చేపట్టాలని దక్షి ణ తెలంగాణ (Telangana) విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. ఈమేరకు సోమవారం మింట్ కాంపౌండ్ లోనిసంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డీఈలతో సమావేశం నిర్వహించారు.

ఎఐ సేవలను అందుబాటులోకి

ఈసందర్భంగా సిఎండీ మాట్లాడుతూ ప్రస్తుతం సంస్థ పరిధిలో 8681,11 కేవీ ఫీడర్లు ఉండగా వాటిలో 6885 ఫీడర్ల పరిధిలో ఫీడెర్ ఔటేజ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా విద్యుత్ సరఫరా పర్యవేక్షణ జరుగుతుందని మిగతా ఫీడర్లను కూడా ఈ సిస్టమ్ పరిధిలోకి వస్తామన్నారు. విద్యుత్ డిమాండ్, సరఫరా, అంతరాయాలు వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసి సంబంధిత ఇంజినీర్లను అప్రమత్తం చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ స్థాయిలో ఎఐ ఆధారిత సేవలను అందుబాటులోకి తేను న్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో సరఫరా, లోపాలను గుర్తించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత సేవలు దోహదం చేస్తాయని తెలిపారు. అదే విధంగా, ప్రతి రోజు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ స్థాయిలో విద్యుత్ సరఫరా పర్యవేక్షణ నిర్వ హించాలని, తరచుగా సమస్యలు ఎదుర్కొం టున్న ఫీడర్లపై, డిటిఆమ్లపై డివిజనల్ ఇంజినీర్, సూపరింటెండింగ్ ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

అలాగే స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ ఏడాదికి ఏడాదికి భారీగా పెరుగుతుందని దానికి తగట్టుగా చేపట్టాల్సిన చర్యలపై ఆగస్టు 15 లోగా నివేదికలు రూపొందించాలన్నారు. కార్యక్రమం లో డైరెక్టర్ ప్రాజెక్ట్స్- వి. శివాజీ, డైరెక్టర్ ఆప రేషన్ డా. నర్సింహులు, డైరెక్టర్ కమర్షియల్- చక్రపాణి, డైరెక్టర్ ఫైనాన్స్-పి కృష్ణారెడ్డి, జోనల్ చీఫ్ ఇంజినీర్స్ సాయి బాబా, ఎల్ పాండ్య, యు.బాల స్వామి, ఏ కామేష్ తదితరులు పాల్గొన్నారు.

Read also: HIV: హెచ్ఐవి బాధితులకు చేయూత

#CustomerMeetings #ElectricityHelpDesk #ElectricityServices #PowerDistribution #TelanganaElectricity #TGSPDCL #TGSPDCLUpdates Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.