हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TGPSC :3 రోజుల్లో గ్రూప్ 2 అభ్యర్థుల నియామక పత్రాలు 

Sushmitha
Telugu News: TGPSC :3 రోజుల్లో గ్రూప్ 2 అభ్యర్థుల నియామక పత్రాలు 

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్ 2 సర్వీసు(Group 2 service) పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు సెప్టెంబర్ 28న విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ(TGPSC) విడుదల చేసింది. మిగిలిన ఒక పోస్టును ‘విత్‌హెల్డ్’లో పెట్టినట్లు వెల్లడించింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తాజా ప్రకటన మేరకు, గ్రూప్ 2 ద్వారా ఎంపికైన 783 మంది అభ్యర్థులకు అక్టోబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు.

Read Also:  Fake doctorates : నకిలీ డాక్టరేట్లతో ప్రతిభకు మకిలి!

TGPSC

నియామక కార్యక్రమం, సమీక్ష

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ నియామక పత్రాల ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. ఈ నియామకాల్లో సాధారణ పరిపాలన, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నుల శాఖలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. అందువల్ల ఆయా శాఖల కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ పేర్కొన్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులను కూడా ఈ కార్యక్రమానికి అనుమతించనున్నారు.

పరీక్షల వివరాలు

టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ 2022లో విడుదల కాగా, రాత పరీక్షలు 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరగడంతో, ఓఎంఆర్ పత్రాల్లో లోపాల కారణంగా దాదాపు 13,315 మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,36,649 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంక్ లిస్ట్ (మార్కులతో సహా)ను మార్చి 11న విడుదల చేసింది. గత నెలలో తుది జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాలు ఎప్పుడు అందజేస్తారు?

అక్టోబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించనున్నారు.

నియామక కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది?

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870