📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

TGCSB: టిజిసిఎస్బి ఆధ్వర్యంలో సైబర్ వారియర్లు, అధికారులకు ప్రత్యేక శిక్షణ

Author Icon By Sharanya
Updated: July 26, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో సైబర్ వారియర్లు, సైబర్ సెక్యూరిటీ విభాగంలో పనిచేసే అధికారులకు శుక్రవారం నాడు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం జరిగింది. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్లో (command control) ని టిజిసిఎస్బి (TGCSB) కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డైరక్టర్ శిఖా గోయల్ ప్రారంభించారు.

ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు (Cyber crimes) ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని తెలిపారు. సైబర్ నేరాలను నివారించేం దుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు నిరంతరం అప్రమత్తంగా వుండా ల్సిన అవసరం వుందని ఆమె అన్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరాలపై విచారణ చేసే అధికారులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సైబర్ నేరాలపై విచారణతో పాటు ఫోరెన్సిలో తాజాగా వున్న సాధనాలు, సాంకేతికతల గురించి వివరించడం, నేరగాళ్ల ను పట్టుకునేందుకు అనుసరించాల్సి వ్యూహాలను ఎలా అమలు చేయాలనే దానిపై చెప్పడం జరిగిందని ఆమె వెల్లడించారు.

గత ఏడాదితో పోలిస్తే 2025లో సైబర్ నేరాలు 16 శాతం తగ్గాయి

ఈ శిక్షణలో 25 మంది సైబర్ వారియర్లతో పాటు సైబర్ క్రైం పోలీసు స్టేషన్ల నుంచి 15 మంది అధికారులను ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. సైబర్ నేరాలపై విచారించే అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుం డడంతో పాటు విచారణ సమయంలో వేగవంతంగా వ్యవహరించాలని శిఖా గోయల్ కోరారు. నిర్లిప్తత ఎంతమాత్రం పనికిరాదని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో 2024తో పోలిస్తే 2025లో సైబర్ నేరాలు 16 శాతం తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయని ఆమె అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా ఈ నేరాలు 37 శాతం పెరిగాయని ఆమె తెలి పారు. ఈ ఏడాది రాష్ట్రంలో సైబర్ నేరాల వల్ల బాధితులు 726 కోట్ల రూపాయలు నష్టపోతు ఇందులో 105 కోట్ల రూపాయలను జప్తు చేసి బాధితులకు అందజేసినట్లు శిఖా గోయల్ తెలిపారు. దీంతో పాటు 1657 సిం కార్డులు, 7178 ఐఎంఈఐ. 565 యుఆర్ఎల్ను బ్లాక్ చేశామని రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలపై చైతన్య కార్యక్రమాలు చేబట్టామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజిసిఎస్బి ఎస్పి హర్షవర్ధన్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Indiramma Houses : గృహ ప్రవేశానికి 5 వేల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధం – అధికారులు

Breaking News Cyber Security Awareness Cyber Warriors Training latest news Telangana Cyber Security Telangana Government Initiatives Telugu News TGCSB

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.