అపరాధ రుసుంతో 28వ తేదీ వరకు అవకాశం
హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లోని పిజి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ కామన్ పిజి ఎంట్రన్స్ టెస్ట్ (టిజిసిపిజిఈటి) – 2025 పరీక్షల దరఖాస్తు గడువు గురువారం (జులై 17)తో ముగిసింది. ఇప్పటి వరకు 56 వేల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అపరాధ రుసుం (Penalty fee) లేకుండా గురువారంతో దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ, అపరాధ రుసుంతో ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కామన్ పిజి ఎంట్రన్స్ పరీక్షలను ఆగస్టు 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.

రుసుం లేకుండా
ఇందుకు సంబంధించి సబ్జెక్టు వారీ పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికీ అధికారులు వెల్లడించారు. జూన్ 18 నుంచి ఆన్లైన్లో (Online) దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించగా, గురువారం వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను స్వీకరించారు. రూ. 500 అపరాధ రుసుంతో జులై 24 వరకు, రూ. 2000తో జులై 28 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పరీక్షలను ఆగస్టు 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్టు ఈ నెల 14న రోజువారీ షెడ్యూల్ను సైతం జారీ చేశారు. ప్రతిరోజూ మూడు సెషన్ల (Three sessions) లో పరీక్షలను నిర్వహించనున్నారు.
TGCPGET అంటే ఏమిటి?
TGCPGET అనేది Telangana Common Post Graduate Entrance Tests కు సంక్షిప్త రూపం. ఇది తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ (Post Graduation) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష.
TGCPGET ఎవర్లు నిర్వహిస్తారు?
TGCPGET ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వేర్వేరు యూనివర్సిటీలు ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను తీసుకుంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Award: కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఉత్తమ అవార్డు