తెలంగాణలో 2026-27 (TG) విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (TG CETs) షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) అధికారికంగా విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌తో (TG EAPCET) పాటు ఐసెట్, ఈసెట్, లాసెట్ వంటి అన్ని ముఖ్యమైన పరీక్షల తేదీలను ఖరారు చేసింది. జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత (ఆన్‌లైన్) విధానంలోనే నిర్వహించనున్నారు.
Read Also: Environmental protection: పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి
పరీక్షల తేదీల వివరాలు
టీజీ ఈఏపీసెట్ (అగ్రికల్చర్, ఫార్మసీ): మే 4, 5 తేదీల్లో, టీజీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్): మే 9 నుంచి 11 వరకు, టీజీ ఎడ్‌సెట్ (TG EdCET): మే 12న, టీజీ ఐసెట్ (TG ICET): మే 13, 14 తేదీల్లో
టీజీ ఈసెట్ (TG ECET): మే 15న, టీజీ లాసెట్ (TG LAWCET): పీజీ ఎల్‌సెట్: మే 18న, టీజీ పీజీ ఈసెట్ (TG PGECET): మే 28 నుంచి 31 వరకు, టీజీ పీఈసెట్ (TG PECET)
మే 31 నుంచి జూన్ 3 వరకు విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకునేందుకు ఈ షెడ్యూల్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. (TGCHE) ఇక ఆయా పరీక్షలకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు ఫీజు, సిలబస్ తదితర పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్లను సంబంధిత సెట్ కన్వీనర్లు త్వరలోనే వేర్వేరుగా విడుదల చేయనున్నారు. తాజా సమాచారం, అప్లికేషన్ తేదీల కోసం విద్యార్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్‌సైట్లను సందర్శించాలని ఉన్నత విద్యామండలి సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: