విద్యార్థులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరుసగా సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఆ రోజు ఆయా పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓటు హక్కు వినియోగానికి ఉద్యోగులకు కూడా హాలిడే ప్రకటించే అవకాశముంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజు కూడా సెలవు ఉండవచ్చని సమాచారం. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.
Read also: Ahmedabad: లంగ్స్ లోకెళ్ళిన హల్క్ బొమ్మ వైద్యులకే పెద్ద సవాలు
Will students get three consecutive days of holiday during the election period
ఫిబ్రవరి 14న రెండో శనివారం కావడంతో
ఒకవేళ ఫిబ్రవరి 11, 13 తేదీల్లో సెలవులు మంజూరైతే విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు దక్కనున్నాయి. ఫిబ్రవరి 14న రెండో శనివారం కావడంతో పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 15న ఆదివారం కూడా సాధారణ సెలవే. దీంతో ఎన్నికలు జరిగే పట్టణాల్లోని విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చే అవకాశంపై ఆసక్తి నెలకొంది. అధికారిక ఉత్తర్వులు వెలువడితే ఇది నిజంగా విద్యార్థులకు శుభవార్తే అవుతుంది. ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఆర్థిక అంశాలపై బడ్జెట్ సమావేశాలు
ఇక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై తెలంగాణ టీచర్స్ ఐకాస (టీజీ టీజాక్) నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. ఆర్థికేతర అంశాలను సంబంధిత శాఖలకు పంపిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఆర్థిక అంశాలపై బడ్జెట్ సమావేశాల అనంతరం చర్చిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్‌ను కూడా కలిసినట్లు నేతలు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: