తెలంగాణ (TG) శాసనసభ నిర్వహణలో గత రెండేళ్ల కాలంలో తీవ్ర వైఫల్యాలు చోటుచేసుకున్నాయని, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు (Gaddam Prasad Kumar) బహిరంగ లేఖ రాశారు.
Read Also: Dharmapuri Arvind: కమీషన్లమయంగా కాంగ్రెస్ సర్కార్
- సభా నిర్వహణ: రూల్ 12 ప్రకారం సభా కార్యకలాపాలకు అవసరమైనన్ని రోజులు సభను నిర్వహించకపోవడం, అలాగే సరైన కారణాలు లేకుండా సభను తరచుగా, హఠాత్తుగా వాయిదా వేయడం రూల్ 13, రూల్ 16 లకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
- ప్రశ్నల సమయం ఉల్లంఘన: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రధాన క్వశ్చన్ అవర్ మరియు జీరో అవర్ నిర్వహణలో నిబంధనలు (రూల్స్ 38 నుంచి 52, 53 నుంచి 62) ఉల్లంఘిస్తున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్డ్ క్వశ్చన్స్ చర్చకు రాకుండా చేయడం ద్వారా రూల్ 38 కల్పించిన ప్రశ్నల సమయ హక్కును కాలరాస్తున్నారని ఆరోపించారు. అలాగే, లోతుగా చర్చించేందుకు సభ్యులకు ఉండే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవకాశాన్ని నిరాకరించడం రూల్ 50 ఉద్దేశానికి విఘాతం కలిగించడమేనని అన్నారు. జీరో అవర్‌ను కుదించడం సభా హక్కులను దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు.
- అన్ స్టార్డ్ ప్రశ్నలు: రూల్ 39 ప్రకారం లిఖితపూర్వక సమాధానాలు సభలో ప్రవేశపెట్టకపోవడం, రూల్ 41 ప్రకారం నిర్ణీత గడువులోగా సభ్యులకు ఆ సమాధానాలు అందకపోవడం వల్ల సభ జవాబుదారీతనం లోపించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కమిటీల వ్యవస్థ స్తంభన మరియు డిప్యూటీ స్పీకర్ నియామక వైఫల్యం
గత రెండేళ్లుగా అసెంబ్లీలో హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ పని చేయడం లేదన్నారు.
- కమిటీల నిలిపివేత: అసెంబ్లీ సమావేశాలు ముగిసినా, కమిటీల పని మాత్రం ఆగకూడదని రూల్ 227 స్పష్టంగా చెబుతున్నప్పటికీ, కమిటీలే లేకపోవడం వల్ల ప్రభుత్వ పనితీరుపై పర్యవేక్షణే లేకుండా పోయిందని తెలిపారు.
- ఎస్టిమేట్స్ కమిటీ: ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ, ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. రూల్స్ 199, 201 ప్రకారం కమిటీల పని ఎప్పుడూ ఆగకూడదని ఉన్నా, వాటిని పట్టించుకోకపోవడం వల్ల కమిటీల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
- డిప్యూటీ స్పీకర్: డిప్యూటీ స్పీకర్ నియామకం జరగకపోవడం మరో ప్రధాన ఉల్లంఘనగా హరీశ్‌రావు పేర్కొన్నారు. రూల్ 8 ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ను తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. సభలో సభ్యుల హక్కులను పరిరక్షించే ప్రివిలేజ్ కమిటీకి డిప్యూటీ స్పీకరే చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ పదవి ఖాళీగా ఉండటం వల్ల కమిటీ నిర్వీర్యం అయిపోయి, సభ్యుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని, ఇది రూల్ 256, 257 లకు విరుద్ధమని స్పష్టం చేశారు.
ఫిరాయింపుల నిరోధక చట్టంపై చర్యల వైఫల్యం
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ (ఫిరాయింపుల నిరోధక) నిబంధనలు 1986, ముఖ్యంగా రూల్స్ 3 నుంచి 7 ప్రకారం విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా, తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) కు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన శం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: