📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG Welfare Schools: సంక్షేమ గురుకులాల కిచెన్ లో సీసీ కెమెరాలు.. ఫుడ్ పాయిజన్ కు చెక్

Author Icon By Anusha
Updated: July 28, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కమిటీలు, సేఫ్టీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్: తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. ఫుడ్ పాయిజనింగ్పై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ గురుకులాల కిచెన్లలో ఇక నుంచి అత్యాధునికమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదేశాలిచ్చినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ. బీసీ, మైనార్టీ గురు కులాల్లో ఈ కెమెరాలను ఫిట్ చేయనున్నారు. ఇప్పటికే గురు కురాల సెస్టీలో భాగంగా ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, నేరుగా కివెన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.

ఫుడ్ పాయిజన్ సంఘటనలను సీరియస్ తీసుకున్న సర్కార్

దీంతోపాటు అడిషనల్ కలెక్టర్లు, స్థానిక నేతలు, అధికారులతో కమిటీలు వేయనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే కలెక్టర్లకు జారీచేయనున్నది. వానకాలం సీజన్ షురూ కాగానే గురుకులాల్లో పుడ్ పాయిజన్ (Food poisoning) ఘటనలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తు న్నాయి. దీంతో ఫుడ్ పాయిజన్ సంఘటనలను సీరియస్ తీసుకున్న సర్కార్ స్పష్టమైన యాక్షన్ ప్లాన్, సెక్యూరిటీ మెజర్స్తో ముందు కెళ్లాలని భావిస్తోంది. కాగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ గురుకులాల్లోని కిచెన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. అయితే ఈ దఫా తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలున్నాయి.

TG Welfare Schools: సంక్షేమ గురుకులాల కిచెన్ లో సీసీ కెమెరాలు.. ఫుడ్ పాయిజన్ కు చెక్

పుడ్ పాయిజన్ ఘటనలు

ఈ కెమెరాలు ఏర్పాటు వెనక బలమైన కారణం ఉన్నదనే విషయాన్ని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రత్యేక రిపోర్టు కూడా ఉన్నట్లు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా గురుకులాల్లో పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. గత ఏడాదిలోనూ, అంచనాకు ఎక్కువగానే సంభవించాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఘటనలపై వివిధ రూపాల్లో రహస్య విచారణ వేయించినట్లు తెలియవచ్చింది. ఈ విచారణ తర్వాత ఫుడ్ పాయిజన్ సంఘటనల్లో కుట్ర కోణం దాగినట్లు ప్రాథమికంగా వచ్చినట్లు సమాచారం.

ప్రత్యేక టీమ్

ఈ నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా, ఒక వేళ చేసిన స్పష్టమైన ఆధారాలను పసిగట్టేందుకు సంక్షేమ గురుకులాల కిచెన్లలోనూ సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు సంక్షేమ శాఖల అధికారుల ద్వారా వెల్లదవుతోంది. ఈ సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించనున్నారు. అక్కడ్నుంచి ప్రత్యేక టీమ్ సంక్షేమ గురుకులాలను మానిటరిం వేయనున్నాయి. దీనితో పాటు, ఇక పుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా రహస్య తనిఖీలు చేయనున్నారు. ఎప్పటికప్పుడ శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించనున్నారు. నిరక్ష వం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకునేలా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణాలో మొదటి రెసిడెన్షియల్ పాఠశాల ఏది?

తెలంగాణాలో మొదటి రెసిడెన్షియల్ పాఠశాల తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్, సర్వాయిల్ (Telangana State Residential School, Sarvail).

తెలంగాణాలో అత్యంత పురాతన పాఠశాల ఏది?

తెలంగాణాలో అత్యంత పురాతన పాఠశాల సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ (St. George’s Grammar School), హైదరాబాద్.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Amina Begum: దుబాయ్ వెళ్లిన పాతబస్తీ మహిళ డ్రగ్స్ కేసులో అరెస్టు

Breaking News food poisoning Telangana kitchen CCTV cameras latest news Revanth Reddy decisions SC ST BC Minority Gurukuls Telangana government safety measures Telangana welfare hostels Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.