తెలంగాణ (TG) రాష్ట్రంలో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు అందజేయనున్నట్లు ఇంటర్మీడియట్ కమిషనరేట్ అధికారులు వెల్లడించారు. ఈ కిట్లలో తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, ఒక జత యూనిఫామ్, వర్క్ బుక్ ఉంటాయి. కాలేజీ స్టార్ట్ అయిన రోజునే వీటిని పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పరీక్షలు పూర్తయిన 15 రోజులకే క్లాసులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also: Nalgonda murder: అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
ఆర్థిక భారం
ఈ నిర్ణయం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ ప్రారంభ సమయంలో పుస్తకాలు, యూనిఫామ్ కొనుగోలు చేయడం వల్ల తల్లిదండ్రులపై వచ్చే ఆర్థిక భారం తగ్గుతుందని అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: