తెలంగాణలో(TG Weather) చలిగాలుల ప్రభావం తీవ్రమైంది. సోమవారం అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు దిగజారడంతో ప్రజలు వణుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లెలో 6.9 డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 17 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవడం గమనార్హం. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 7 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 8.3 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్‌లో 8.7 డిగ్రీలు నమోదయ్యాయి. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 9.5 డిగ్రీలు, కామారెడ్డిలో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ రాత్రివేళ చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
Read Also: TG: మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు
ఏడు జిల్లాలకు ఆరెంజ్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఏడు జిల్లాలకు కోల్డ్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. (TG Weather) ఈ జిల్లాల్లో డిసెంబర్ 26 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల మధ్య కొనసాగవచ్చని ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా హైదరాబాద్, హనుమకొండ, కరీంనగర్, వరంగల్ సహా మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, ఉదయ వేళ పొగమంచు ఏర్పడే అవకాశముందని ఐఎండీ బులెటిన్ పేర్కొంది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 13 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: