📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest News: TG Weather: రానున్న రెండు రోజులు వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

Author Icon By Anusha
Updated: November 23, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో (TG Weather) ఒకవైపు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మలక్కా స్ట్రైట్ మధ్య ప్రాంతంలో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఉదయం దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది.

Read Also: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. 2 గంటలు దాటితే ఫైన్!

ఈ అల్పపీడనం రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. నవంబర్ 24 నాటికి ఇది ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Department) అంచనా వేసింది.అంతేకాకుండా.. ఈ వాయుగుండం తదుపరి 48 గంటల్లో అంటే నవంబర్ 26, బుధవారం నాటికి మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశలో కదలి, నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని కూడా పేర్కొంది.

ఈ వ్యవస్థ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి. ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ (TG Weather) జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఈ వర్షాలు ఈ సీజన్‌లో అసాధారణమైనవిగా పరిగణించవచ్చునని అధికారులు చెబుతున్నారు.

TG Weather: Rains for the next two days.. Meteorological Department issues warnings

ఈ నెల చివరి వారంలో చలి తీవ్రత పెరగనుంది

ఎందుకంటే సాధారణంగా నవంబర్ చివరి వారంలో చలి తీవ్రత పెరుగుతుందని దానికి భిన్నంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు.గాలులు ప్రధానంగా తూర్పు దిశ నుంచి వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. రాగల రెండు,

మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bay Of Bengal Hyderabad Met alert latest news Telangana Weather Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.