తెలంగాణ రాష్ట్రంలో (TG Weather) వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారబోతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల (Southwest monsoon) తిరోగమనం, వలన వాతావరణంలోమార్పులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా, ఎడతెరపి చినుకులు పడుతున్నాయి.
Read Also: Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు నేడు భారీ వర్ష సూచన: తెలంగాణలో ఎల్లో అలర్ట్
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణ (TG Weather) పై నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనుదిరుగుతున్నాయి. ఈ రుతుపవనాల ముగింపుతోపాటు, ఈశాన్య రుతుపవనాలు (Northeast Monsoon) దక్షిణ భారత రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈదురు గాలులు వీచే అవకాశముందని
ఈ రెండు రుతుపవనాల మార్పుల దశలో వాతావరణంలో అస్థిరత ఏర్పడి, రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.ముఖ్యంగా నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపించనుంది.
ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: