తెలంగాణ (TG) లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారనున్నాయి. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు విస్తార ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HYD) వెల్లడించింది.
Read Also: TG SEC: కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయండి
ప్రస్తుతం రాష్ట్రం మీదుగా తూర్పు, నైరుతి దిశల్లో వీస్తున్న గాలులు వర్షాలకు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. HYDలో సాయంత్రం నుంచి వాన పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడే ఆస్కారమున్నట్లు వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: