తెలంగాణ (TG Weather) లో,రాబోయే రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. (TG Weather) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెల్లవారుజాము, రాత్రి వేళల్లో అవసరం అయితేనే బయటకు రావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: TG Weather: పెరిగిన చలి తీవ్రత..
చలి ప్రభావం
ఈ తీవ్రమైన చలి గాలుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి ప్రభావం వల్ల కేవలం జలుబు, దగ్గు మాత్రమే కాకుండా.. రక్తపోటు పెరగడం, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఈ సమయంలో బయట తిరగకపోవడమే మంచిదని చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: