📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG: గిరిజన రైతులకు జల వికాసం

Author Icon By Saritha
Updated: February 4, 2026 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బడ్జెట్లో మరో రూ.600 కోట్లు కేటాయింపు

హైదరాబాద్ : (TG) రాష్ట్రంలోని గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం నిమిత్తం గిరిజన భూములకు సాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఇందిర సౌర గిరిజన వికాసం పథకం అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) సంస్థ నుంచి రూ. 600 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నాబార్డ్ సంస్థతో చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే ఈ సంస్థ నుంచి ప్రభుత్వానికి రుణాలు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మార్చి నెలలోపు నిధులను మంజూరు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించింది.

Read Also: Municipal Elections : మున్సిపల్ ఎన్నికలు.. ఆ రెండు రోజులు సెలవు?

Water development for tribal farmers

10 వేల మంది గిరిజన రైతులకు లబ్ధి

వీటితో పాటు అనుకున్నట్టు నాబార్డు సంస్థ నుంచి కూడా (TG) ప్రభుత్వానికి నిధులు మంజూరు అయితే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక నిధులు అందింన వెంటనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఉన్న అర్హులైన రైతుల నుంచి ధరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించనుంది. అయితే ఈ స్కీమ్ కింద అటవీ హక్కుల పత్రాలు కలిగిన సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగానే ఒక్కో రైతుకు రూ. 6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100 శాతం సబ్సిడీతో అందించనుంది. ఈ సోలార్ ప్యానళ్లు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ను రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం విగియోగించుకోనున్నారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం వినియోగించుకోగా, మిగిలిన విద్యుత్ను గ్రిడ్ను అమ్మేందుకు అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం. ఈ మిగులు గ్రిడ్ ద్వారా ప్రతి రైతు నెలకు సుమారు రూ.3 నుంచి 5వేల వరకు ఆదాయం పొందవచ్చని అంచనా వేస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Indira Solar Giri Jal Vikasam Latest News in Telugu NABARD Loan telangana government Telugu News Tribal Farmers tribal welfare department

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.