📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

TG: మహిళా సంఘాలకు విజయ్ డెయిరీ పార్లర్ కేటాయింపులు

Author Icon By Saritha
Updated: December 22, 2025 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం(TG) డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ప్రతి పథకంలో వారిని అధిక సంఖ్యలో భాగస్వాములను చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల్లో వారి పేరు మీదనే ఇళ్లు మంజూరు చేస్తోంది. ఇక మహిళా సంఘాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. తాజాగా మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, పెట్రోలు బంకులను మహిళా సంఘాలకు కేటాయించిన ప్రభుత్వం, ఇప్పుడు పాడి రంగంలోనూ వారిని భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.మహిళా సంఘాలకు విజయ డెయిరీ పార్లర్లను కేటాయించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం.. ఇందిరా మహిళా శక్తి పథకం కింద వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

Read Also: Telangana: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శ..

విజయ డెయిరీ పార్లర్స్: మహిళల ఆర్ధికాభివృద్ధికి అవకాశం

ఈ పార్లర్ల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు వారం, పది రోజుల్లో డీఆర్‌డీవో, మెప్మాలకు అందనున్నాయి. (TG)ప్రస్తుతానికి మండలానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు విజయ డెయిరీ పార్లర్లు కేటాయించనున్నారు. ఇక మున్సిపాలిటీల్లో రెండు చొప్పున మహిళలకు కేటాయించే విధివిధానాలు రూపొందిస్తున్నారు. విజయ డెయిరీ పార్లర్ మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలంటే పారిశ్రమాభివృద్ది సహకార సమాఖ్యకు రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మహిళలు పార్లర్ ఏర్పాటు కోసం స్థలాన్ని తీసుకోవాలి. అనంతరం రూ. 5 వేలు చెల్లిస్తే పార్లర్ మంజూరు చేస్తారు. అంతేకాకుండా పార్లర్ ఏర్పాటు కోసం మహిళలకు రూ.5 లక్షల వరకు ఖర్చు కానుంది. ఇందుకోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది. ఈ పార్లర్ ఏర్పాటు చేసుకుంటే అందులో విజయ డెయిరీ ప్రొడక్ట్‌లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన పదార్ధాలను విజయ డెయిరీ సరఫరా చేస్తూ ఉంటుంది. పాలు, పెరుగు, పన్నీర్, వాటర్ బాటిళ్లు వంటివి ఇందులో విక్రయించాల్సి ఉంటుంది. వీటి విక్రయం ద్వారా వచ్చే ఆదాయం మహిళల ఆర్ధికాభివృద్దికి సహాపడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:



Dairy Sector Latest News in Telugu Telangana Congress Government Women Empowerment Women in Dairy Women SHGs Women Welfare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.