తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక అడుగు వేస్తోంది. (TG) దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రణామం, బాల భరోసా అనే రెండు వినూత్న పథకాలను రూపొందించింది. ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారు ఈ ప్రతిష్టాత్మక పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దివ్యాంగుల సహకార సంస్థ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో నిధులను కేటాయించి వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
Read also: Srisailam: ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
వైకల్య రహిత తెలంగాణ దిశగా కీలక అడుగులు
దివ్యాంగుల కోసం ప్రభుత్వం సుమారు రూ. 50 కోట్ల భారీ నిధిని కేటాయించింది. ఇందులో భాగంగా రూ. 43.22 కోట్ల విలువైన అత్యాధునిక సహాయక పరికరాలను సుమారు 7 వేల మంది అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. (TG) ఈ పరికరాల జాబితాలో దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు, వీల్ చైర్లతో పాటు విద్యా, ఉపాధి అవకాశాల కోసం ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి యంత్రాలు ఉన్నాయి.
వృద్ధుల కోసం ప్రణామం డే కేర్ సెంటర్లు వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వృద్ధుల మానసిక ఉల్లాసం, సంరక్షణ కోసం ‘ప్రణామం’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను మంజూరు చేశారు. వైకల్య రహిత తెలంగాణే లక్ష్యంగా బాల భరోసా రాష్ట్రంలోని చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఉండే శారీరక లేదా మానసిక వైకల్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వాటిని నివారించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com