📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

TG: పల్లెలూ కాంగ్రెస్ ‘చేతి’లోనే

Author Icon By Saritha
Updated: December 18, 2025 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పాటైనాక జరుగుతున్న అభివృద్ధిసంక్షేమం చూసి ఉప ఎన్నికలలో కాంగ్రెస్కు మొగ్గుచూపు తుంటే పల్లెలు కూడా అదే దారిలో నడుస్తూ కాంగ్రెస్కు మరోమారు పట్టం కట్టాయని టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో హర్షం చేస్తూ తెలిపారు. (TG) పంచాయతీ ఎన్నికలు-2025 మూడో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని మహేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే మన విజయం సాధించడం గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై వ్యక్తం చేసిన విశ్వాసానికి స్పష్టమైన ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల మూడో విడత ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారాయని, తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పుకు ఇవి సంకేతమని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ విజయం వెనుక సమన్వయంతో కూడిన బలమైన ప్రచార వ్యూహాలే ప్రధాన కారణమని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను ఒకే వేదికపై సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకు విస్తరించిన ప్రచారం పార్టీకి అనుకూలంగా మారిందని తెలిపారు.

Read also: HYD: తెలంగాణలో కొత్త హైకోర్టు

The villages are also in the hands of the Congress.

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల సానుకూల స్పందన

ప్రజల ఆశయాలకు అద్దం పట్టే విధంగా వచ్చిన ఈ తీర్పు,(TG) కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనం మూడు విడతలలోనూ కాంగ్రెస్ హవాయే ప్రజల ఆశయాలకు అద్దంపట్టిన తీర్పు: పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పట్ల గ్రామీణ ప్రజల్లో ఏర్పడిన సంతృప్తిని మరోసారి రుజువు చేసిందని టిపిసిసిచీఫ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా అమలవుతున్న ప్రజాపాలన, సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్న తీరు ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టం గా కనిపిస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయపరిచినా ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగించిందనా చెప్పుకొచ్చారు. గ్రామస్థాయి సమస్యలను గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు. పరిష్కరించేందుకు ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు అనుకూలంగా మారిందని మహేష్ గౌడ్ విశ్లేషించారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ ఓటర్లలో కాంగ్రెస్పై విశ్వాసాన్ని మరింత పెంచాయని తెలిపారు.

సర్పంచ్ ఎన్నికల ఫలితాలు: ప్రజల ఆశయాలకు అద్దం

ప్రజలను నేరుగా కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధానం పార్టీ బలాన్ని పటిష్టం చేస్తోందని పేర్కొన్నారు. సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి” అనే నినాదానికి ప్రజలు పట్టం కట్టారని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఘన విజయం దీనికి స్పష్టమైన ప్రతీక అని మహేష్ గౌడ్ అన్నారు. మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్కు మద్దతు తెలపడం గ్రామ పాలనా వ్యవస్థలో కొత్త దిశను సూచిస్తోందని, పంచాయతీ ఎన్నికల్లో సామాజిక న్యాయం స్పష్టంగా ప్రతిఫలించిందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్న తీరు తెలంగాణలో నూతన రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతోందని టిపిసిసి అధ్యక్షుడు అభిప్రాపడ్డారు. ఈ విజయం పార్టీపై మరింత బాధ్యతను పెంచిందని, గ్రామీణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు… పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప్రాధాన్యత కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సర్పంచ్ ఎన్నికల తొలి, రెండో, మూడో విడతల ఫలితాలు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై గ్రామీణ స్థాయిలో ఏర్పడిన అనుకూల వాతావరణానికి అద్దం పడుతున్నాయని, ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

congress Latest News in Telugu Mahesh kumar Goud panchayat elections Rural Development Sarpanch Results Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.