📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

TG: స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి విరుద్దం

Author Icon By Saritha
Updated: December 18, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్పీకర్ తీర్పుపై మండిపడ్డ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : (TG)ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్(Gaddam Prasad) కొట్టివేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. ట్రిబ్యునల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించడంలో స్పీకర్ విఫలమయ్యాడని విమర్శించారు. ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటును తిరస్కరిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం తీర్పు వెలువరించిన అనంతరం.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కలిసి కేపీ వివేకానంద మాట్లా డారు. ఫిరాయింపులను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బాహాటంగా సమర్థిం చుకున్నారని గుర్తుచేశారు. సీఎం సమర్థింపులకు అనుగుణంగాస్పీకర్ తీర్పునిచ్చారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేపీ వివేకానంద అన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బాహాటంగానే కాంగ్రెస్లో ఉన్నారని, ఫిరాయించిన ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్లెక్సీలు, పోస్టర్లలో ఫిరాయించిన ఎమ్మెల్యేల ఫొటోలు ఉన్నాయని తెలిపారు. స్పీకర్ తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనే తీర్పు ఇచ్చారని కేపీ వివేకానంద తెలిపారు. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలపై అడిగితే స్పీకర్ నుంచి సమాధానం లేదని అన్నారు.

Read also: Telangana: సర్పంచ్ ఎన్నికల్లో ‘జగన్ పై చంద్రబాబు’ విజయం!

The Speaker’s ruling is unconstitutional.

ఎమ్మెల్యేలు ఫిరాయింపులపై సుప్రీంకోర్టు హెచ్చరిక

న్యూఇయర్ వేడుకలు(TG) ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించడంతో స్పీకర్ ఈ తీర్పును వెలువరించారని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణను పొడిగిస్తే చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించిందని గుర్తుచేశారు. స్పీకర్ నోటీసులకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ నుంచి ఎలాంటి జవాబు రాలేదని అన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అసెంబ్లీ రూల్స్ బుక్ ప్రకారం జడ్జిమెంట్ కాపీ తమకు ఇవ్వాలని కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. స్పీకర్ జడ్జిమెంట్ కాపీని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామన్నారని తెలిపారు. కానీ జడ్జిమెంట్ తయారైందా లేదా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నామంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారని చెబు తున్నారని పేర్కొన్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లో తిరుగుతారని నిలదీశారు. మా పోరాటం ఫలితంగానే స్పీకర్ ఈ తీర్పు అయినా ఇచ్చారని అన్నారు. తెలంగాణ స్పీకర్ కార్యాలయం సుప్రీం కోర్టులో పరువు తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయిం పులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

CM Revanth Reddy Disqualified MLAs Judgment Release State Politics Supreme Court Warning Telangana Speaker

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.