తెలంగాణలో (TG) రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రక్రియ మొదలైంది. ఆదివారం నుంచి నామినేషన్లు స్వీకరణ ఈ రోజు (ఆదివారం) ప్రారంభమైంది. నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 3న నామినేషన్ల పరిశీలన చేస్తానున్నారు.
Read Also: TG: తెలంగాణలో మరో రైల్వేలైన్‌కు గ్రీన్‌సిగ్నల్..
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 14వ తేదీన ఈ రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. (TG) ఈ మేరకు ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఇక నవంబర్ 25వ తేదీ మంగళవారం రోజున పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలు.. 1,12,242 వార్డులకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనునున్నట్లు తెలిపింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: