TG: ఈరోజే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం

Read Time:  1 min
TG: ఈరోజే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం
FONT SIZE
GET APP

(TG) దాదాపు రెండేళ్ల తర్వాత ఇవాళ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. 2024 జనవరిలో పాలక మండళ్ల పదవీకాలం ముగియగా.. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారులే పాలనను కొనసాగించారు. (TG) నూతనంగా ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 12702 గ్రామాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి.

Read Also: Bollaram: హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖులతో రాష్ట్రపతి ఎట్ హోం వేడుక

సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం

ఇందుకోసం పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరగనున్నాయి. ముందుగా వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతూ గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయనున్నారు.  

TG: The new sarpanches will be sworn in today
TG: The new sarpanches will be sworn in today

ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత కొత్త సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామ పంచాయతీ మొదటి సమావేశం నిర్వహిస్తారు. తమకు ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ పాలకవర్గం తీర్మానం చేస్తుంది. మరోవైపు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.   

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.