📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

TG: హిల్ట్ పాలసీతో రాష్ట్రానికి రూ.10,776 కోట్ల ఆదాయం

Author Icon By Saritha
Updated: January 7, 2026 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : పారదర్శకంగా అందరికీ ఒకే నిబంధనలు వర్తించేలా ఆరు నెలల కాలవ్యవధిలో అమలులోకి తీసుకువచ్చే విధంగా హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ) ని ప్రభుత్వం తీసుకువచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు అసెంబ్లీలో తెలిపారు. హిల్ట్ పాలసీ లేకపోతే ఎకరానికి రూ.12 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చేది. కానీ ఈ రోజు కొత్త పాలసీ ద్వారా ఎకరాకు రూ.7 కోట్ల ఆదాయం రాబోతోందని ఆయన తెలిపారు. (TG) గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రీ హోల్డ్, గ్రిడ్ పాలసీ ద్వారా రూ.574కోట్ల ఆదాయం వచ్చే చోట రూ.10,776 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చేలా హిల్ట్ పాలసీని రూపొందించామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పాలసీపై అడ్డగోలుగా మాట్లాడుతూ విషం కక్కవద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం విజప్తి చేశారు.

Read also: Uttar Pradesh: వివిధ కారణాల వల్ల 2.8 కోట్ల ఓట్లు రద్దు

2014 నుంచి నేటి వరకు విచారణకు సిద్ధమన్న ప్రభుత్వం

ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసేందుకు (TG) ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అనుమానాలు ఉన్న సభ్యులు ఎవరైనా ప్రభుత్వానికి లేఖ రాస్తే 2014 నుంచి నేటి హిల్ట్ పాలసీ వరకూ ఏ ఏజెన్సీ ద్వారా అయినా ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఒక పక్క కాలుష్యకారక పరిశ్రమలను రింగ్ రోడ్ బయటకు తరలిస్తూ నగరంలో డీజిల్ బస్సులను దశల వారీగా హైదరాబాద్ అవతలికి తరలిస్తూ.. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నాం. ఎస్టీపీల ద్వారా డ్రైనేజీ కాలువల నీటిని శుద్ధి చేస్తున్నాం. ఈనగరాన్ని మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని కాపాడేందుకు హిల్ట్ పాలసీ తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీ రాగానే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం 5లక్షల కోట్ల కుంభకోణం జరుగు తోందని ప్రకటించారు. మరొకరు 9 వేల ఎకరాలను అమ్మకానికి పెట్టి అంతకన్నా ఎక్కువ స్థాయిలో కుంభకోణం అని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు మర్చిపోయి బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేశారు. గుడ్డ కాల్చి పక్కవాడి మీద వేసి మసి తుడుచుకోమన్నట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. వ్యక్తిగత ప్రయో జనాలే వారికి ముఖ్యం అని డిప్యూటీ సీఎం దుయ్యబట్టారు.

హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి నేపథ్యం

హైదరాబాద్ మహానగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమలు రావడంతో నగరం విస్తృత స్థాయిలొ ముందుకు సాగుతోంది. రాచరికం నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వాల వరకు హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు. 1927లో నిజాం కమిటీని వేసి 136 ఎకరా లభూమిని పరిశ్రమల కోసం కేటాయించారు. పరిశ్రమల భూముల్లో లీజులు, ప్రభుత్వం అమ్మిన భూములు, వ్యక్తిగత భూములపై పరిశ్రమలు పెట్టారు. (TG) పరిశ్రమల భూములపై హక్కులన్నీ పరిశ్రమల యాజమాన్యం వారిదే. వాటిపైన ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేవు. ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన హిల్ట్ పాలసీ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రభుత్వ భూములను ప్రయివేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తే.. మా ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు యాజమాన్య హక్కులు ఉన్నా.. వారి నుంచి కూడా ప్రభుత్వానికి ఆర్ధిక లాభం చేకూరేలా నిర్ణయం చేశాం. మా ప్రభుత్వం రూపాయి రూపాయి కూడబెట్టి ప్రజలకు అందిస్తున్నాం.

హైదరాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. పరిశ్రమలను నగరం నుంచి బయటకు తీసుకువెళ్లాలని 2012లోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ 2013లో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. గత ప్రభుత్వం పారిశ్రామిక పార్కులను ఐటీ పార్కులుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. అందులో బాగంగా 50 శాతం ఐటీ పార్కుల కోసం కేటాయించి.. మిగిలిన 50 శాతం భూమిని కమర్షియల్ గా మార్చుకునేలా అవకాశం కల్పించింది. గత ప్రభుత్వమే ఎస్ఆ౦ ధరపైన 30 శాతం అదనంగా కట్టి.. భూమిని కన్వర్ట్ చేసుకునే అవకాశం ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు. మా ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకువచ్చింది. దీనికి సంబంధించి సీరియస్ గా కేబినెట్ సబ్ కమిటీని వేసిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

BhattiVikramarka DeputyCM HILTPolicy HyderabadIndustrialLand LandPolicy Latest News in Telugu StateRevenue TelanganaGovernment Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.