9న జరగాల్సి ఉండగా.. 17కి వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ (TG) ఉన్నత విద్యా మండలి ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్(ఈసీ) మీటింగ్కి వాయిదాల పర్యం కొనసాగుతోంది. ఏడాదిన్నర అనంతరం ఈ నెల 9న జరగాల్సిన ఈసీ మీటింగ్ అనుకొని కారణాలతో ఈనెల 17కి వాయిదా పడింది. నేడు(శనివారం) జరగాల్సిన సమావేశం కూడా మరోసారి వాయిదా పడింది. ఈ నెల 9న జరగాల్సిన మీటింగ్కి ప్రభుత్వం తరపున హాజరు కావల్సిన విద్యా శాఖ కార్యదర్శి హాజరుకాలేకపోతున్నట్టు సమాచారం ఇవ్వడంతో.. ఈ నెల 17కి సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఈ నెల 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలమూరు యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నందున.. అదే కార్యక్రమానికి విద్యా శాఖ కార్యదర్శి కూడా హాజరు కావల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన ఈసీ మీటింగ్ను ఈ నెల 20కి వాయిదా వేయాలని సూచించినట్టుగా తెలిసింది.
Read also: Telangana: ములుగు జిల్లా రద్దుపై సీతక్క క్లారిటీ
ఉన్నత విద్యా పాలనపై వాయిదాల ప్రభావం
దీంతో ఈ నెల 20న ఉన్నత విద్యా మండలి ఈసీ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. (TG) ఉన్నత విద్యా మండలి సమావేశంలో 2024 ఆగస్టు చివరి వారంలో జరిగింది. అనంతరం 2024 అక్టోబర్ 17న ఉన్నత విద్యా మండలి ఛైర్మన్గా ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బాలకిష్టారెడ్డి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇప్పటి వరకు ఉన్నత విద్యా మండలి ఈసీ మీటింగ్ జరగలేదు. తాను ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టి 15 నెలలు పూర్తికావొస్తుంది. ఉన్నత విద్యా మండలి ఈసీ మీటింగ్ జరగక సుమారు ఏడాదిన్నర కావొస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణంగా ఈసీలో అనుమతి తీసుకోవల్సిన అంశాలతోపాటు ఆర్థిక అవసరాల కోసం బడ్జెట్ ఆమోదం కూడా తీసుకోవల్సి ఉంటుంది. ఇలా ఏడాదిన్నరలో పలు నిర్ణయాలు తీసుకున్నందున వాటిన్నింటికీ ఈసీలో ఆమోదం తీసుకోవల్సి ఉంటుంది. 20న జరగనున్న ఈసీ మీటింగ్లో సుమారు 30కి పైగా అంశాలు ఎజెండాలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: