📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

TG: ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు

Author Icon By Aanusha
Updated: January 18, 2026 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) లో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ దిశగా ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది. సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఫీజుల పెంపుపై స్పష్టమైన నియంత్రణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రెండేళ్లకు ఒకసారి కేవలం 8 శాతం వరకు మాత్రమే ట్యూషన్ ఫీజు పెంచుకునేలా నిబంధనలు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి అవసరమైన కసరత్తు జరుగుతోంది.ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు విద్యా కమిషన్ “తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు-2025″ను సిద్ధం చేసింది.

Read Also: Telangana: పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

TG: The government is working on controlling private school fees

ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు భేటీ

పురపాలక ఎన్నికల తర్వాత జరిగే కేబినెట్ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ప్రకారం, 8 శాతం కంటే ఎక్కువ ఫీజు పెంచాలనుకుంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసే రాష్ట్రస్థాయి కమిషన్ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.అయితే, ప్రభుత్వ ప్రతిపాదనను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏటా ద్రవ్యోల్బణం 5-6 శాతం పెరుగుతోందని, టీచర్ల జీతాలు, భవనాల అద్దెలు ఏటా పెరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రెండేళ్లకు ఒకసారి 8 శాతం పెంపు ఏమాత్రం గిట్టుబాటు కాదని స్పష్టం చేస్తున్నాయి.

ఉన్నత విద్యా సంస్థల మాదిరిగా పాఠశాలల్లో యాజమాన్య కోటా వంటి అదనపు ఆదాయ మార్గాలు ఉండవని వారు గుర్తు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగా ఏటా ఫీజులు పెంచుకునే అవకాశం కల్పించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘంతో ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు భేటీ కానున్నారు. అటు తల్లిదండ్రులకు ఉపశమనం, ఇటు విద్యాసంస్థల మనుగడ మధ్య ప్రభుత్వం ఎలాంటి మధ్యేమార్గం కనుగొంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Fee Regulation latest news private schools telangana government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.