📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

TG: డ్వాక్రా సంఘాల బకాయిలపై సర్కార్ ఉక్కుపాదం

Author Icon By Saritha
Updated: January 5, 2026 • 1:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అప్పు కట్టకపోతే ఆస్తులు జప్తు, రెవెన్యూ రికవరీ చట్టం అమలు

హైదరాబాద్ : డ్వాక్రా సంఘాల బకాయిల విషయంలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం(Government) కీలక హెచ్చరిక జారీ చేసింది. (TG) ముఖ్యంగా స్త్రీనిధి ద్వారా రుణాలు పొంది, నెలవారీ వాయిదాలు చెల్లించడంలో నిరక్ష వహిస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. పేరుకుపోయిన మొండి బకాయిల వసూలు కోసం ప్రభుత్వం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తారు. దీని ప్రకారం రుణం చెల్లించని వారి ఆస్తులను జప్తు చేసే అధికారం అధికారులకు లభిస్తుంది. ఇళ్లు, భూములు వంటి స్థిరాస్తులతో పాటు ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని, వాటిని బహిరంగంగా వేలం వేస్తారు. ఆ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం తన బకాయి కింద జమ చేసుకుంటుంది. ఈ చట్టం అమలుతో బకాయిదారులపై ఒత్తిడి పెంచి, వసూళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read also: Jaggareddy: మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బిఆర్ఎస్ నేతలు

డ్వాక్రా సంఘాల రుణాల వసూళ్లకు ప్రభుత్వం కఠిన హెచ్చరిక

ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో (TG) ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. (TG) జిల్లా వ్యాప్తంగా సుమారు 60 వేల మందికి పైగా డ్వాక్రా సభ్యులు ఉండగా, వారికి ప్రభుత్వం ఇప్పటివరకు చాలామంది మహిళలు తమ వ్యాపారాల కోసం రూ.475 కోట్ల రుణాలు అందించింది. రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. అయితే, జిల్లాలో వసూలు కావాల్సిన రూ.101 కోట్లకు గాను కేవలం రూ.78 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దాదాపు రూ.23 కోట్లు మొండి బకాయిలుగా పేరుకుపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంలో అత్యంత కీలకమైన అంశం ఒకటుంది. రుణం తీసుకున్న సభ్యురాలి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేకపోతే, ఆ అప్పును తీర్చే బాధ్యత గ్రూప్లోని మిగిలిన సభ్యులపై పడుతుంది. అంటే, ఒకరు చేసిన పొరపాటుకు సంఘంలోని అందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది.

అవసరమైతే ఇతర సభ్యుల ఆస్తులను కూడా జప్తు చేసేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో, సంఘంలోని మహిళలు పరస్పర సహకారంతో సకాలంలో రుణాలు చెల్లించేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే సెర్చ్, మెప్మా అధికారులు గ్రామాల్లో వర్యటించి బకాయిల చెల్లింపుపై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరించనున్నట్లు డీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి కూడా అనుమతులు రావడంతో, త్వరలోనే జప్తు ప్రక్రియ ప్రారంభం కామందని తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Dwakra Societies Government Recovery Latest News in Telugu Outstanding Loans Revenue Recovery Act telangana government Telugu News Women Entrepreneurs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.