TG: ఉపాధి హామీ పథకం అమలులో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ (TG) ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఇకపై ఉపాధి పనులు పూర్తయిన తర్వాత ఖజానా (ట్రెజరీ) శాఖ ఆమోదం పొందిన అనంతరమే నిధులు విడుదల చేయనుంది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానుంది. దీని ద్వారా నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
Read alo: Telangana: ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి బెయిల్
hanges in the employment guarantee scheme.
‘ఎస్‌ఎన్‌ఏ స్పార్ష్’ మాడ్యూల్‌లో
కొత్త విధానం ప్రకారం గ్రామస్థాయిలో చేపట్టే ఉపాధి పనుల వివరాలను ‘ఎస్‌ఎన్‌ఏ స్పార్ష్’ మాడ్యూల్‌లో నమోదు చేయాలి. కూలీల పనివివరాలు, ఉపయోగించిన సామగ్రి రికార్డులను ట్రెజరీ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ట్రెజరీ ఆమోదం వచ్చిన తర్వాతే ఈ వివరాలను పీఎఫ్‌ఎంఎస్‌ఎస్‌కు పంపించి, పరిశీలన పూర్తైన అనంతరం నిధులు విడుదల చేస్తారు. అటవీ శాఖ, ఐటీడీఏ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో జరిగే పనులన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
ఇప్పటివరకు నేరుగా ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్ ద్వారా నిధులు విడుదల చేయడంతో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ కొత్త మార్పులు తీసుకొచ్చింది. అలాగే ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తన వాటా బిల్లులకు ఆమోదం ఇచ్చిన తర్వాతే కేంద్రం నిధులు విడుదల చేసేలా మార్పులు చేశారు. దీంతో ఉపాధి హామీ పనుల్లో జాప్యం తగ్గి, నిధుల వినియోగం సక్రమంగా జరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: