తెలంగాణ (TG) అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి సోమవారం (డిసెంబర్ 29 2025) ప్రారంభం అవుతున్నాయి.. అయితే.. ప్రారంభానికి ముందే తెలంగాణ (TG) అసెంబ్లీ సమావేశాలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Read Also: TG: బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ చాలెంజ్‌అవార్డుల ప్రదానోత్సవం
మొదట డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు
ఈ సమావేశాల్లో ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా జలాల వాటా అంశంపై కేసీఆర్ మాట్లాడే, అవకాశం ఉంది. తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. ఉద్దేశపూర్వకంగానే రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని కేసీఆర్ ఆరోపిస్తున్నారు.
కృష్ణా నదిపై తెలంగాణ హక్కులను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆయన గట్టిగా నిలదీయనున్నారు.కాగా ఇవాళ సభలో మొదట డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు, GHMC చట్ట సవరణ బిల్లులను సీఎం సభలో ప్రవేశపెట్టనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: