హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)- 2026 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో టీజీ టెట్-2026కి సంబంధించిన ప్రత్యేక ప్రసారాలను టి-సాట్ ప్రసారం చేయనుంది. ఇందుకు సంబంధించిన పోస్టరు ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం సచివాలయంలో టి-సాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు నాణ్యమైన కంటెంట్ అందిస్తున్న టి -సాట్ను అభినందించారు. ఉపాద్యాయ ఉద్యోగ పరీక్షకి టెట్ అర్హత తప్పనిసరి కావడంతో అభ్యర్థులందరూ టి-సాట్ డిజిటల్ కంటెంట్ ద్వార సంసిద్ధులు కావాలని సూచించారు.
Read also : Operation Kagar: మావోయిస్టు కేంద్ర కమిటీపై పెద్ద దెబ్బ
తెలంగాణ ప్రజాప్రభుత్వం ఉపాద్యాయ అర్హత
తెలంగాణ ప్రజాప్రభుత్వం ఉపాద్యాయ అర్హత పరీక్షలను ప్రతీ ఏటా రెండు సీజన్లలో నిర్వహిస్తుండగా నిత్యం అందుబాటులో ఉండే టి-సాట్ నెట్వర్క్(T-SAT NETWORK) కంటెంట్ అన్ని స్థాయిల్లో అభ్యర్థులకు ఉపయోగపడుతుందని మంత్రి గుర్తుచేశారు. గత రెండు సంవత్సరాల కాలంలో మూడు టెట్ పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం, 2026 జనవరి నెలలో నిర్వహించే టెట్-2026 పరీక్ష కోసం టి-సాట్ నెట్వర్క్ స్పెషల్ డిజిటల్ కంటెంట్ అందిస్తోందని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్రెడ్డి తెలిపారు. ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖకు మెరుగైన వసతు ల్ని కల్పిస్తున్నారని, 11వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు రికార్డు కాలంలో పూర్తి చేశారన్నారు.
CLICK HERE: https://tgtet.aptonline.in/tgtet/
కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం టెట్ అర్హత
కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం టెట్ అర్హత ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడికీ తప్పనిసరి అయిన నేపథ్యంలో టెట్కు హాజరయ్యే అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కంటెంట్ అందిస్తున్నామని సీఈవో తెలిపారు. ప్రభు త్వం ప్రకటించిన పరీక్షల తేదీలను అనుసరించి టెట్(TET) పరీక్షలకు మంగళ, బుధవారాల్లో లైవ్ ఓరియంటేషన్ తోపాటు 44 రోజులు 200 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. టి -సాట్ నిపుణ ఛానల్లో సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు, విద్య ఛానల్లో ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ప్రతి రోజు నాలుగు గంటల పాటు ప్రత్యేక ప్రసారాలుంటాయన్నారు.
టెట్కు అవసరమైన సబ్జెక్టులు చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీ, ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్, మాథ్స్, సోషల్ స్టడీస్ తోపాటు ఇంగ్లీష్, తెలుగు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన డిజిటల్ లెసన్స్ ప్రసారమవుతాయన్నారు. టెట్ పేపర్-1, 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టి-సాట్ అందించే ప్రసారాలను సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి నిరుద్యోగ అభ్యర్థులకు సూచించారు. టెట్ అర్హత పరీక్ష కోసం టి-సాట్ నెట్వర్క్ ప్రసారం చేసే ప్రత్యేక కంటెంట్ టి-సాట్ శాటిలైట్ ఛానళ్లతోపాటు, టి-సాట్ యాప్, యూట్యూట్లో అందుబాటులో ఉంటాయన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టి-సాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాధిక్ పాల్గొన్నారు.
CLICK HERE: https://tgtet.aptonline.in/tgtet/
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :