Polavaram Project: పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ(TG) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టుపై స్టే విధించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆర్జించింది. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదుల నుంచి రావాల్సిన నీటి వాటా తీవ్రంగా తగ్గిపోతుందనీ, సాగు, తాగునీటి అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి పొంది ఉందని తెలంగాణ ప్రభుత్వం భయాందోళనలు వ్యక్తం చేసింది. బచావత్ ట్రిబ్యునల్(Bachawat Tribunal) భిన్నంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేసింది.
Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
తెలంగాణ నీటి హక్కులకు భంగం
ఆర్టికల్ 32 అనుసరించి రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే అంశంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు సంబంధిత సంస్థలపై రిట్ పిటిషన్ వేసింది. ఏలాంటి అనుమతులు లేకుండా వేవడుతున్న నలమలసాగర్ ప్రాజెక్టు డిపిఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఆవార్డు అనుసరించి పోలవరం ప్రాజెక్టు ద్వారా కేవలం 80 టిఎంసిల నీటిని మాత్రమే కృష్ణా బేసిన్లో వినియోగించుకోవడానికి అనుమతించారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో వేసిన పిటిషన్లో వివరించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకోకుండా కృష్ణాటెసిన్ అవతలి బేసిన్కు కూడా నీటి అవసరాలు తీర్చుకొనేలా అదనంగా 200 నుంచి 300 టిఎంసి నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమలసాగర్కు తరలించేందుకు ప్రాజెక్టును చేపడుతోందని పిటిషన్లో స్పష్టం చేసింది. గతంలో పోలవరం-బనకచర్లగా ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చి అర్జంతరంగా మానుకొందని ఇప్పుడు పేరు మార్చి కొంత డిజైన్ మార్చి మళ్ళీ నీటి చౌర్యం చేయడానికి ఎత్తులు వేస్తున్నారని దుయ్యబట్టారు.
కేంద్ర జల సంఘం, గోదావరి నది నిర్వహణ మండలి, పర్యావరణ మంత్రిత్వశాఖల నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని తెలంగాణ ఆరోపించింది. సిడబ్యుసి ఇన్ఫ్రాన్సిపల్ అనుమతి లేకపోయినా డిపిఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం చట్ట విరుద్దమని పిటిషన్ తెలంగాణ తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వివరించారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమై తెలంగాణ తరుపున వాదించాల్సిన అంశాలపై తెలిపారు.
పోలవరం–బనకచర్ల పేరు మార్పు వెనుక అసలు కథ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు స్థానంలో తాజాగా తెరపైకి తీసుకొచ్చిన పోలవరం- నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు తో పోలవరం నుంచి బొల్లాపల్లి జలాశయానికి గోదావరి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్ జలాశయానికి తరలిస్తారు. దీని కోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి గత నవంబర్ 27వ తేదీన టెండర్లకు ప్రకటన వెలువడింది. అదే సందర్భంలో పోలవరం-జనకచర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారికి గత అక్టోబర్ 29వ తేదీన పిలవగా వచ్చిన టెండర్లను రద్దు చేశారు. కృష్ణానదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదని, ఇదే సందర్భంలో ప్రతి ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు పోలవరం -బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాదిన్నర కిందట నిర్ణయించింది.
రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జునసాగర్ కుడి కాలుష వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష ్యంతో సుమారు 80 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందంటూ ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రతిపాదించారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి మొదటి రెండు దశలను యధాతథంగానే ఉంచి మూడో దశలోనే మార్పులు చేస్తున్నారు. మూడో దశలో గతంలో అనుకున్నట్లు పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి జలాశయం నుంచి కర్నూలు జిల్లాలోని బనకచర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్న నల్లమలసాగర్ జలాశయం వరకు మాత్రమే నీళ్లను తరలిస్తారు.
తాజాగా ప్రతిపాదించిన ఈ మూడో దశ కోసం దాదాపు రూ.9,000 కోట్లు ఖర్చవుతుందని లెక్క వేస్తున్నారు. పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టు మూడు దశలు కలిపి నిర్మాణానికి రూ.58 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. మొదట్లో భావించిన మూడు సెగ్మెంట్లలోనే పనులు చేయనున్నారు. మూడో సెగ్మెంట్లో గతంలో అనుకున్నట్లు బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుంచి నల్లమలసాగర్ జలాశయం వరకే అది పరిమితం కానుంది. గతంలో బనకచర్ల ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును రూ.81,900 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పుడు సుమారు రూ.27 వేల కోట్ల ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమలసాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలనేది కొత్త ప్రణాళిక. అవసరమైతే ఈ కలా లను సోమశిలకూ మళ్లిస్తారు.
పోలవరం జలాల మళ్లింపుపై ఏపీ–తెలంగాణ మధ్య కొత్త న్యాయపోరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధన్యత ఇస్తున్న నల్లమలసాగర్పై తెలం గాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఈ ప్రాజెక్టుపై ఆశ్రయిం చడంపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే అనిశ్చితి అటు ఆంధ్రప్రదేశ్ కూడా తెలెత్తింది. పోలవరంబనకచర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు మార్చి పోలవరం నల్లమలసాగర్గా రేపడుతోందని, ఆ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించామని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆది నుంచి చెబుతూ వస్తున్నారు. పోలవరంబనరచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించామని అదే దారిలో కొత్త ప్రాజెక్టు వల్ల కోల్పోయే తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టులో ఎవరు గెలుస్తారో, ఎవరు అన్యాయానికి గురవుతారో కాలమే పరిష్కారం చూపనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: