📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: TG: భారీగా ప్రభుత్వ వైద్య  పీజీ సీట్లు పెంపు

Author Icon By Saritha
Updated: October 18, 2025 • 1:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 102 ఎంఢీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం

తెలంగాణలో వైద్య విద్య అభ్యాసాన్ని కలలుగన్న పీజీ (PG) ఆశావహులకు శుభవార్త. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 102 కొత్త ఎండీ సీట్లను మంజూరు చేస్తూ తాజాగా అనుమతి ఇచ్చింది. ఫలితంగా ప్రభుత్వ(TG) కళాశాలల్లో ఉన్న పీజీ సీట్ల మొత్తం సంఖ్య 1,274 నుంచి 1,376కి పెరిగింది. ఈ తాజా అనుమతిలో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ మెడికల్ కాలేజ్‌కు అత్యధికంగా 23 సీట్లు కేటాయించగా, నల్గొండకు 19, సూర్యాపేట మరియు రామగుండం కాలేజీలకు తలతలకి 16 సీట్లు ఇచ్చారు. నిజామాబాద్, సిద్దిపేటకు 8 సీట్లు, ఉస్మానియా, నిమ్స్, మహబూబ్‌నగర్‌లకు 4 చొప్పున సీట్లు పొందాయి. మొత్తం 16 విభాగాల్లో సీట్ల పెంపు జరిగింది. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్‌లో 16, పీడియాట్రిక్స్‌లో 14, అనస్థీషియా విభాగంలో 12, గైనకాలజీలో 10 సీట్లు పెరిగాయి. ఉస్మానియాలో కొత్తగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుకు 4 సీట్లు మంజూరయ్యాయి.

Read also: గచ్చిబౌలిలో విషాదం నీటి సంపులో పడి బాలుడు మృతి

TG: భారీగా ప్రభుత్వ వైద్య  పీజీ సీట్లు పెంపు

డీఎన్‌బీ సీట్ల పెంపు, డీఎం కోర్సులకు అనుమతి యత్నం కొనసాగుతోంది

ఇక రాష్ట్ర ప్రభుత్వం(TG) మరో ముందడుగు వేస్తూ, 50 కొత్త డీఎన్‌బీ పీజీ సీట్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఈ సీట్లు భద్రాచలం, గజ్వేల్, కింగ్ కోఠి, మిర్యాలగూడ, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేడియాలజీ, జనరల్ మెడిసిన్ వంటి విభాగాల్లో తీసుకురావాలని భావిస్తున్నారు.

అదే సమయంలో, కాకతీయ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ కోర్సుల (DM) విస్తరణపై ప్రతిపాదనలు ఎన్‌ఎంసీకి పంపినట్లు సమాచారం. ఈ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తగ్గి, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Breaking News in Telugu Government Medical Colleges Latest News in Telugu MD seat increase NMC Approval Telangana healthcare Telangana PG Medical Seats Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.