📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: దావోస్ లో తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

Author Icon By Saritha
Updated: January 17, 2026 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నూతన ఆవిష్కరణలకు వేదికగా తెలంగాణ

హైదరాబాద్ : ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఒక కొత్త సంస్థను కు తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) రంగంలో (TG) తెలంగాణను గ్లోబల్ లీడర్గా నిలబెట్టే దిశలో ఒక చారిత్రాత్మక ఆడుగుగా, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్ హబ్ (టిఏఐహెచ్) ను దావోస్లో ప్రారంభించనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ఈనెల 20న ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ఎఐ పరిజ్ఞానాన్ని ఇమడ్చటం, ఎఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఆర్ ప్రత్యేకంగా రూపొందించిన స్వతంత్ర సంస్థగా, టిఏఐ హెచ్ ప్రపంచంలోనే తొలి ప్రపంచ ఏఐ ప్రయోగ వేదికగా పనిచేస్తుంది. ఇప్పటి దాకా భారతదేశపు టెక్నాలజీరంగపు కేంద్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు ప్రపంచ నూతన ఆవిష్కరణల రాజధానిగా మారిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు. దావోస్లో తాము కేవలం పెట్టుబడులు మాత్రమే అడగడం లేదని, భాగస్వామ్యాలకై చేయి చాస్తున్నామని వివరించారు. నూతన ఆవిష్కరణలు, ప్రతిభల మేలుకలయికగా ఉన్న తెలంగాణలో ఏఐ భవిష్యత్ను నిర్మించడానికి ప్రపంచదేశాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్, చిప్ డిజైన్ వంటి డీప్టెక్ రంగాలలో నూతన ఆవిష్కరణలకు చోదక శక్తిగా పనిచేసేలా టిఏఐ హెచ్ రూపొందించబడింది.

Read also: Medak: అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

డీప్‌టెక్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దిశానిర్దేశం

తెలంగాణ (TG) ప్రగతిశీల ఏఐ వ్యూహంలో భాగంగా, విధానాల రూపకల్పన నుండి భారీస్థాయి అమలు దిశగా ఒక నిర్ణయాత్మక మార్పును టిఏఐహెచ్ తమైన, సూచిస్తుంది. ప్రపంచానికి మరో ఇంక్యుబేటర్ అవసరం లేదని, ఒక ఇన్నోవేషన్ శాండ్బాక్స్ అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు. టిఏఐహెచ్ ప్రారంభంద్వారా తాము ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో డీప్టెక్ రంగాలలో అత్యాధునిక ఆవిష్కరణలకు వేదికను ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ అత్యంత సురక్షి ఎంటర్ప్రైజ్డ్ ఉత్పత్తులు తెలంగాణలో రూపుదిద్దుకుంటాయని చెప్పారు. నూతన ఆవిష్కరణల వేగానికి అనుగుణంగా విసృత స్థాయిలో పనిచేయగల కొత్త సంస్థాగత నమూనాగా టిఏఐహెచ్ రూపుదిద్దుకుంది. ప్రభుత్వ సంస్థలు ఎలా రూపకల్పన చేయబడతాయి, నిర్వహించబడతాయి అనే దానిని పునర్నిర్మించడం ద్వారా. వేగవంతమైన ప్రయోగాలు, వేగవంతమైన అమలు, ప్రైవేట్ రంగంతో లోతైన భాగస్వామ్యాన్ని టిఏఐహెచ్ సాధ్యం చేస్తుంది.

టిఏఐహెచ్ ప్రత్యేక బలం దాని రూపకల్పనలోనే ఉందని, ఇది వేగం, స్థాయి, ప్రభావం కోసం రూపొందించిన సంస్థ అని ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సంజయ్ కుమార్ అన్నారు. స్టార్టవ్ చురుకుదనం, ఎంటర్ప్రైజ్ సామర్థం, ప్రభుత్వ విశ్వసనీయత, విసృతిని సమన్వయం చేయడం ద్వారా, ఇది వేగవంతమైన ఇన్నోవేషన్ న్ను సాధ్యం చేస్తుందని తెలిపారు. ఉత్పత్తి-మార్కెట్ సరిపోలికను వేగవంతం చేస్తుందని, వెంచర్ క్యాపిటల్ను ఆకర్షిస్తుందని, పైలట్ దశను దాటి విభిన్న రంగాల్లో విస్తృత స్థాయి వాణిజ్య అమలుకు పరిష్కారాలను తీసుకెళ్తుందని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా, డీప్- టెక్ భవిష్యత్తుకు స్వాగతం ద్వారా పలికే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్నోవేషన్-ఫస్ట్ దృక్పథాన్ని ఈ ప్రారంభకార్యక్రమంలో ప్రదర్శించనున్నారు.

ప్రపంచ టాప్ 20 ఇన్నోవేషన్ హబ్లలో చోటు లక్ష్యం

డిస్రిప్టివ్ ఎఐ మోడల్స్, అటానమస్ ఏజెంట్లు, క్వాంటమ్ టెక్నాలజీలు, అధునాతన సెన్సార్ ప్లాట్ఫామ్లు, సూపర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నిర్వచించబడే తదుపరి ఇన్నోవేషన్ యుగంలోకి ప్రవేశిస్తున్నామని, ఈ కీలక సమయంలో టిఏఐహెచ్ను ప్రారంభించడం ద్వారా (TG) తెలంగాణ ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేసి, ప్రపంచంలోని టాప్ 20 ఇన్నోవేషన్ హబ్లలో ఒకటిగా తెలంగాణను నిలపడం తమ లక్ష్యంమని టిఏఐహెచ్ సీఈఓ ఫణి నాగార్జున చెప్పారు. కార్యక్రమ వివరాలు తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ అధికారిక ప్రారంభం ఈ నెల 20న సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు, దావోస్లో ని మోంటెన్ ప్లాజా హోటల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాధినేతలు, పరిశ్రమల అధినేతలు, టెక్నాలజీ రంగ హాజరుకానున్నారు. టిఏఐహెచ్ అనేది కృత్రిమ మేధస్సులో ఇన్నోవేషన్, పరిశోధన, అమలును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలకు మధ్య వారధిగా పనిచేస్తూ, జనాభా స్థాయిలో గ్లోబల్ సవాళ్లకు పరిష్కారాలు అందిస్తుంది. టిఏఐహెచ్ నాలుగు వ్యూహాత్మక స్థంభాలపై పనిచేస్తుంది టాలెంట్ ఫౌండ్రీ, ఇన్నోవేషన్ ఇంజిన్, క్యాపిటల్ ప్లైవీల్, ఇంపాక్ట్ ల్యాబ్స్ నైపుణ్యాలు, పరిశోధన నుంచి స్టార్టప్లు, మూల ధనం, వాస్తవ ప్రపంచ ప్రముఖులు ఉంటారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AI Innovation Hub Artificial intelligence Davos Deep Tech Latest News in Telugu Quantum Computing TAIH Telangana Telugu News World Economic Forum

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.