TG: బి-ఫాం ఇచ్చిన అభ్యర్థులకు సహకరించి గెలిపించండి

Read Time:  1 min
TG: బి-ఫాం ఇచ్చిన అభ్యర్థులకు సహకరించి గెలిపించండి
FONT SIZE
GET APP

హైదరాబాద్ : (TG) మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి బి.ఫాం ఇచ్చిన వాళ్లు మాత్రమే ఎన్నికల బరిలో ఉండాలని, నామినేషన్లు వేసిన మిగిలిన బీజేపీ (BJP) నాయకులంతా పార్టీ శ్రేయస్సు ద్రుష్ట్యా తక్షణమే నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనేక సర్వే నివేదికల ఆధారంగా, సామాజిక పరమైన అంశాలతో, పార్టీ ప్రత్యేక అంశాలతో గెలిచే అవకాశాలు ఉన్నాయన్న అభ్యర్థులకే పార్టీలోని ముఖ్యమైన వారు సామూహికంగా కలిసి టిక్కెట్లు ఖరారు చేశామని పేర్కొన్నారు. టిక్కెట్ రానివాళ్లు బాధపడడం సహజం. గత అనేక సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం గెలుపు కోసం పనిచేస్తున్న వారిని గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు పార్టీ కార్యకర్తల కృషి, బిజెపి పట్ల ప్రజలకున్న విశ్వాసంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ ఘన విజయాలను సాధించింది.

Read Also: ‘Red’ Mark Politics : CM రేవంత్ ‘రెడ్’ మార్క్ పాలిటిక్స్!

TG: బి-ఫాం ఇచ్చిన అభ్యర్థులకు సహకరించి గెలిపించండి
Support the candidates who have been given the B-form and ensure their victory.

క్రమశిక్షణకు విరుద్ధంగా పోటీ చేస్తే కఠిన చర్యలు

ఈ మున్సిపల్ ఎన్నికల్లో (TG) కూడా కార్యకర్తల కృషితో ప్రజల మద్దతుతోనే పార్టీ మున్సిపల్ ఎన్నికలలో విజయ పరంపర కొనసాగిస్తుందన్న విశ్వాసం రాష్ట్ర పార్టీకి పూర్తిగా ఉందన్నారు. వెంటనే నామినేషన్లను ఉపసంహరించుకుని వారి డివిజన్లు, వార్డుల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి అని కోరారు.

పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తే మాత్రం పార్టీ రాష్ట్ర నాయకత్వం సీరియస్గా పరిగణిస్తుందని తెలిపారు. ఎవరైనా నామినేషన్లను ఉపసం హరించుకోకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకుంటే వాళ్లను 15 ఏళ్లపాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులోనూ అలాంటి వారిని తిరిగి బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.