📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

TG: కృత్రిమ కండల కోసం స్టెరాయిడ్ ఇంజక్షన్ల సరఫరా

Author Icon By Saritha
Updated: January 27, 2026 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాస్క్ ఫోర్స్కు చిక్కిన నేరగాడు

హైదరాబాద్ : వ్యాయామశాలల్లో దేహదారుఢ్యం పెంచుకునేందుకు యువకులు కసరత్తులు చేయడం తెలిసిందే. (TG) అయితే ఇదే సమయంలో కొందరు కృత్రిమంగా కండలు పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతుండడం తరచూ వెలుగు చూస్తోంది. ఇందుకు గానూ ప్రమా దకరమైన స్టెరాయిడ్ ఇంజక్షన్లను వాడుతున్నారు. వీటిని కొందరు నేరగాళ్లు జింల నిర్వాహకులకు లేదా కసరత్తులు చేసే యువకులకే అమ్ముతున్నారు. వీటిని సర్కారు చాలాకాలం క్రితమే నిషేధించినా అమ్మకాలు మాత్రం కొనసాగుతూనే వున్నాయి. ఈ క్రమంలో అనేకసార్లు అనేక మంది నేరగాళ్లు పట్టుబడగా పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులకు మరో నేరగాడు చిక్కాడు. ఇతని వద్ద నుంచి పెద్ద సంఖ్యలో స్టెరాయిడ్ ఇంజక్షన్లను జప్తు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను టాస్క్ ఫోర్స్ అదనపు డిసిపి ఇక్బాల్ సిద్ధిఖీ సోమవారం మీడియాకు వెల్లడించారు.

Read Also: TG: భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ

Supplying steroid injections for artificial muscle enhancement.

నిషేధిత ఇంజక్షన్ల అక్రమ సరఫరా

(TG) పాతబస్తీలో ని కిషన్బాగ్కు చెందిన మహమ్మద్ ఫైసల్ ఖాన్ (25) ఓ ప్రైవేటు కార్మికుడు. ఫర్నీచర్ దుకాణంలో పనిచేసే ఇతను తన సంపాదనతో కుటుంబ పోషణ కష్టం అవడంతో అడ్డదారి తొక్కాడు. తనకు పరిచయం వున్న మెడికల్ షాప్ల నిర్వాహకుల నుంచి అక్రమంగా మెఫెం టర్మైన్ సల్పేట్ 30 ఎంజి అనే స్టెరాయిడ్ ఇంజక్షన్లను (injections) తక్కువ ధరకు కొనుగోలు చేసేవాడు. ఆనంతరం వీటిని తనకు తెలిసిన జిం నిర్వాహకులతో పాటు కసరత్తు లు చేసే యువకులకు ఎక్కువ ధరకు అమ్మేవాడు.

వాస్తవానికి ఇలాంటి ఇంజక్షన్లు వాడడం వల్ల ఆరోగ్యం పాడవడంతో పాటు కొన్నిసార్లు మరణం సంభవిస్తుంది. వీటిని వాడి ఆనారోగ్యం పాలైన వారు, చనిపోయిన వారు కూడా వున్నారు. కాగా ఫైసల్ ఖాన్పై నిఘా వుంచిన పశ్చిమ మండల పోలీసులు అతన్ని సోమవారం నాడు అత్తాపూర్ పరిధిలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇతని వద్ద నుంచి 133 మెఫెంటర్మైన్ సల్ఫేట్ 30 ఎంజి ఇంజక్షన్లతో పాటు 100 డిస్పోసల్ సిరంజీలు, ఒక సెల్ఫోను జప్తు చేశారు. పట్టుబడ్డ స్టెరాయిడ్ ఇంజక్షన్ల విలువ లక్షా 60 వేల రూపాయ లుగా నిర్ధారించారు. నిందితుడిని తదువరి విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:




Fitness Drug Abuse Hyderabad crime Illegal Drug Supply Latest News in Telugu Steroid Injections Task Force Police Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.