📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: ఓపెన్ కానీ పాలీసెట్ వెబ్సైట్ ఆందోళనలో విద్యార్థులు

Author Icon By Saritha
Updated: February 3, 2026 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : (TG) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరడానికి నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పాలీ సెట్)-2026 దరఖాస్తుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు సాంకేతిక విద్యా మండలి అధికారులు ప్రకటించినప్పటికీ వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. సోమవారం ఉదయం నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినప్పటికీ ఉదయం నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Read Also: Telangana: సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రూ.500 కోట్లు ప్రతిపాద

ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ

(TG) పాలీసెట్ దరఖాస్తులను సోమవారం (ఫిబ్రవరి 2) నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నట్టు పాలీసెట్ కన్వీనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 అపరాధ రుసుంతో ఏప్రిల్ 21 వరకు, రూ.300 అపరాధ రుసుంతో ఏప్రిల్ 22 వరకు దరఖా స్తులను స్వీకరించనున్నారు. మే 13న పాలీసెట్-2026 పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహించిన అనంతరం 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.

ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో డిప్లమా కోర్సులతోపాటు, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి అగ్రికల్చర్ యూనివర్సిటీ (Jayashankar Bhupalpally Agriculture University) హార్టీ కల్చర్ యూనివర్సిటీ అందించే హార్టీ కల్చర్ డిప్లమా కోర్సులను, పశు సంవర్థక శాఖ నిర్వహించే డిప్లమా కోర్సుల్లోనూ అడ్మిషన్లను పాలీసెట్-2026 ద్వారా చేపట్టనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులను సోమవారం నుంచి ప్రారంభించగా.. అపరాధ రుసుంతో కలిపి ఏప్రిల్ 22 వరకు స్వీకరిం చనున్నారు. పరీక్షను మే 13న నిర్వహించి .. పరీక్ష ముగిసిన 12 రోజుల్లో ఫలితాలను ఇవ్వనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

application process Latest News in Telugu PolyCET Polytechnic Admissions Polytechnic CET 2026 Student Concerns Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.