News Telugu: TG: ములుగు అడవుల్లో గణనీయంగా పెరిగిన సీతాకోకచిలుకల సంఖ్య

Read Time:  1 min
News Telugu: TG: ములుగు అడవుల్లో గణనీయంగా పెరిగిన సీతాకోకచిలుకల సంఖ్య
FONT SIZE
GET APP

TG: ములుగు జిల్లా అడవుల్లో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ప్రత్యేక సర్వేలో అరుదైన సీతాకోకచిలుకల (Butterfly) జాతులు బయటపడ్డాయి. లక్నవరం, తాడ్వాయి, పస్రా అభయారణ్యాల్లో జరిగిన ఈ పరిశోధనలో మొత్తం 80 కొత్త రకాల సీతాకోకచిలుకలను గుర్తించారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు ఇందారం నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సర్వేలో దేశంలోని పలు రాష్ట్రాల నుండి వచ్చిన 60 మందికి పైగా వైల్డ్ లైఫ్ నిపుణులు, పర్యావరణ పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారని తెలిపారు.

Read also: TG: నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

సీతాకోకచిలుకలు ఎంతో కీలకమని

TG: ఈ కొత్తగా గుర్తించిన జాతులతో తెలంగాణలో సీతాకోకచిలుకల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. ములుగు జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతకు సీతాకోకచిలుకలు ఎంతో కీలకమని, ఈ పరిశోధన జీవవైవిధ్య పరిరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. అడవుల్లో నూతన జీవవైవిధ్యాన్ని వెలికితీసిన ఈ సర్వేకు పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.