రాష్ట్రంలోని గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే టిజి కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026(TG SET) గడువు దరఖాస్తు రేపటి(బుధవారం)తో ముగియనుంది. ఇప్పటి వరకు సుమారు 1.54 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.
Renu Desai : మీడియా ప్రతినిధిపై ఫైర్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్
ఫిబ్రవరి 22న టిజి సెట్ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కోసం టిజి సెట్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్లో దరఖాస్తు గడువు రేపటి(21)తో ముగియనుంది. దరఖాస్తు గడువు పొడిగించబోమని ఎస్సీ గురుకుల సొసైటీ ఇప్పటికే స్పష్టం చేసింది. మే నెలాఖరు నాటికి ప్రవేశాల ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా ఎసిసి గురుకులం అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల సొసైటీల(Residential Schools) పరిధిలో 637 పాఠశాలల్లో 5వ తరగతిలో 51,408 సీట్లు అందు బాటులో ఉన్నాయి. అవి కాకుండా 6, 7, 8, 9, 10 తరగతుల్లో బ్యాక్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్లో భాగంగా గత యేడాది డిసెంబరు 11 నుంచి ఎస్సీ గురుకులు సొసైటీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 22న అన్ని జిల్లాల్లో ప్రవేశపరీక్షను నిర్వ హించనున్నారు. ఈ యేడాది మార్చిలో ఫలితాలను వెల్లడించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: