📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG Secretariat: తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..

Author Icon By Anusha
Updated: July 20, 2025 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలోకి వచ్చే సందర్శకుల ప్రవేశాన్ని మరింత ప్రమాణబద్ధంగా, సురక్షితంగా నిర్వహించేందుకు కొత్త ఈ-పాస్ విధానంను త్వరలో అమల్లోకి తీసుకురానుంది. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ద్వారా సందర్శకుల వివరాలను ముందుగా నమోదు చేసి, (QR Code) కోడ్ ఆధారిత పాస్ ద్వారా వారికి ప్రవేశం కల్పిస్తారు.ఈ కొత్త విధానం అమలుతో సచివాలయ భద్రతను మరింత బలోపేతం చేయడం, అనవసర సందర్శకుల రాకపోకలను నియంత్రించడం ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటివరకు అనుసరిస్తున్న సాధారణ విజిటింగ్ అవర్స్ యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఈ-పాస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

సందర్శకులను లోనికి అనుమతించడానికి, ప్రతి మంత్రి, కార్యదర్శి పేషీకి ఈ పోర్టల్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కేటాయిస్తారు. వారి పేషీకి వచ్చే సందర్శకుడి పేరు, చిరునామా, ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేయగానే ఆ సందర్శకుడి స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) కు ఒక క్యూఆర్ కోడ్ పంపబడుతుంది. సచివాలయం ఎంట్రీ గేట్ వద్ద సందర్శకులు ఈ క్యూఆర్ కోడ్‌ను చూపించాల్సి ఉంటుంది. అక్కడ విధిలో ఉన్న భద్రతా సిబ్బందికి ఈ కోడ్‌ను స్కాన్ చేసేందుకు ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించారు. యాప్‌లో కోడ్‌ను స్కాన్ చేయగానే సందర్శకుడి వివరాలు డిస్‌ప్లే అవుతాయి. వాటిని సరిచూసుకున్న తర్వాతే సందర్శకులను లోనికి అనుమతిస్తారు.

TG Secretariat: తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..

సందర్శకుల వేళలు

ప్రస్తుతం సచివాలయంలో సందర్శకుల వేళలు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉన్నప్పటికీ, ఉదయం 10 గంటల నుంచే చాలా మంది మంత్రులు, కార్యదర్శుల పేషీల నుంచి ఫోన్ చేసి తమకు సంబంధించిన వ్యక్తులను లోనికి పిలుచుకుంటున్నారు. దీంతో రోజుకు ఎంత మంది సందర్శకులు లోనికి వెళ్తున్నారో, వారి వివరాలు ఏమిటో లెక్కలు ఉండటం లేదు. ఈ కొత్త ఈ-పాస్ విధానం అమల్లోకి రావడంతో, ఏ పేషీ నుంచి విజిటర్‌కు క్యూఆర్ కోడ్ వెళ్లింది, ఒక పేషీ నుంచి రోజుకు ఎంత మందికి పాస్‌లు జారీ అయ్యాయి, సచివాలయంలోకి ప్రతి రోజు ఎంత మంది వస్తున్నారు అనే పూర్తి వివరాలు GAD అధికారుల వద్ద నమోదు అవుతాయి. ఇది భద్రతను పెంపొందించడమే కాకుండా, సందర్శకుల రాకపోకలపై పూర్తి జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది.

తెలంగాణ సచివాలయంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-పాస్ వ్యవస్థ అంటే ఏమిటి?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోకి వచ్చే సందర్శకులను నియంత్రించేందుకు ఈ-పాస్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ పాస్ సిస్టమ్.

ఈ-పాస్ ఎవరి కోసం?

ఈ-పాస్ వ్యవస్థ విజిటర్లు, అంటే మంత్రి పేషీలకు లేదా కార్యదర్శుల వద్దకు వస్తున్న వ్యక్తుల కోసం. వారు సచివాలయంలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Latest Crime News: కూతురిని వేధించాడని యువకుడిని హత్య చేసిన తండ్రి..ఎక్కడంటే?

IT department initiative QR code entry secretariat visitor pass SPF security telangana e-pass system telangana government digital system Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.