తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (TG SEC) కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీ (GP) వార్డుల వారీగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను మరోసారి పూర్తి చేయాలని సూచించింది.
Read Also: Jagruti Teachers Federation: నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన కవిత

(TG SEC) ఆదేశాల ప్రకారం, 2025 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఇప్పుడు ఓటరుగా నమోదు కావచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రూపొందించే అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నవంబర్ 15 వరకు నమోదు అయ్యే వారందరినీ స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలో కూడా చేర్చాలని ఎన్నికల సంఘం తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: