మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) జయంతి సందర్భంగా తెలంగాణ (TG) ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. సుమారు 65 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు చీరలు పంపిణీ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేసింది.
Read Also: Ande Sri: గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని
ఈ చీరల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం (TG) మహిళా సంక్షేమం, చేనేత అభివృద్ధి దిశగా కీలక అడుగుగా భావిస్తోంది.ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని, వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా, ఇందిరా మహిళా శక్తి చీరకు రూ.480గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా భారీగా చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పనిదొరికినట్లయ్యింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: