📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

TG: సంక్రాంతి కానుక: త్వరలో యాసంగి రైతు భరోసా డబ్బులు..

Author Icon By Rajitha
Updated: December 26, 2025 • 4:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ, రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో రైతు భరోసా (former support) నిధులను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి పండుగ నాటికి ఈ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే వానాకాలం సీజన్‌లో తొమ్మిది రోజుల్లోనే భారీగా నిధులు జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

Read also: TG EAPCET: ఏప్రిల్ చివరి వారంలో నిర్వహణకు అవకాశం

Yasangi farmer support funds will be released soon

ప్రక్రియను జనవరి రెండో వారం నాటికి పూర్తి

రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు పంట సీజన్లకు కలిపి ఎకరానికి రూ.12,000 చొప్పున రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తోంది. వానాకాలం సీజన్‌లో సుమారు 69 లక్షల మంది రైతులకు రూ.9,000 కోట్లకు పైగా నిధులు నేరుగా ఖాతాల్లో జమయ్యాయి. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జనవరి రెండో వారం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.18,000 కోట్లను కేటాయించారు.

ఉపగ్రహ చిత్రాలు, డిజిటల్ మ్యాపింగ్‌ను

ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. సాగు చేయని భూములకు నిధులు వెళ్తున్నాయన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఉపగ్రహ చిత్రాలు, డిజిటల్ మ్యాపింగ్‌ను వినియోగిస్తున్నారు. పంటలు సాగు చేస్తున్న భూములకే సాయం అందించేలా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. దీని వల్ల నిజమైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరనుండగా, ప్రభుత్వ ఖజానాపై భారం కూడా తగ్గనుంది. యాసంగి సాగు సమయంలో నగదు అందుబాటులోకి రావడం వల్ల విత్తనాలు, ఎరువులు సకాలంలో కొనుగోలు చేయగలుగుతారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Rythu Bharosa Scheme Telangana Farmers Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.