📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TG: రూ.1.30 కోట్ల సిఎంఆర్ ధాన్యం పక్కదారి

Author Icon By Sushmitha
Updated: November 11, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ(TG) వ్యాప్తంగా రైస్ మిల్లర్లు(Rice millers) కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్)ను తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా నల్లబజారుకు తరలిస్తుండటంతో, ప్రభుత్వం అక్రమ దందాను కట్టడి చేసేందుకు విజిలెన్స్ తనిఖీల తీవ్రతను పెంచింది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఆర్సీపురం అధికారులు పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామంలోని విజయదుర్గ ఆగ్రోస్ ఇండస్ట్రీలో ఆదివారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 2024-25 రబీ సీజన్‌కు చెందిన రూ.1.28 కోట్ల విలువగల ధాన్యాన్ని రైస్ మిల్లర్ చీకటిబజారుకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.

Read Also: Trump Tariffs : భారత్ పై టారిఫ్లు తగ్గిస్తాం – ట్రంప్ ప్రకటన

TG

రైస్ మిల్లర్ల అక్రమాలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నష్టాలు

రబీ సీజన్‌లో మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన 5,537 క్వింటాళ్ల ధాన్యం (సుమారు 13,842 గోనెసంచులు) రైస్ మిల్లులో లెక్కించగా తక్కువ వచ్చాయి. సదరు రైస్ మిల్లర్‌ను ప్రశ్నించినప్పటికీ, ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. రైస్ మిల్లర్లు తెలంగాణలో దశాబ్దాలుగా సీఎంఆర్ బియ్యం అప్పగింతలో అనేక అక్రమ పద్ధతులు ఆచరిస్తుండటంతో, సివిల్ సప్లై కార్పొరేషన్ నానాటికి అప్పుల్లో కూరుకుపోతోంది. ప్రస్తుతం ఈ సంస్థకు రూ.59 వేల కోట్ల అప్పులు, రూ.11 వేల కోట్ల నష్టంతో కూనారిల్లుతోంది. సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా సీఎంఆర్ వ్యవస్థను చక్కబరచాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, సిబ్బంది, రైస్ మిల్లర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు.

సీఎంఆర్ ధాన్యం(grain) ఇవ్వడానికి ప్రభుత్వం ఇటీవల బ్యాంకు గ్యారంటీ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. సీఎంఆర్ బియ్యం ఎగవేతకు పాల్పడే రైస్ మిల్లర్లు, లీజుకు రైస్ మిల్లు తీసుకునే వ్యాపారులు 25 శాతం బ్యాంక్ పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, రా లేదా బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఎవరూ కూడా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. విజిలెన్స్ దాడులు చేసినా వారిలో భయం భక్తి లేకపోవడం, ‘టేక్ ఇట్ ఈజీ’ ధోరణితో వ్యవహరిస్తుండటం గమనార్హం.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

civil supplies corporation. CMR scam custom milling rice Google News in Telugu Latest News in Telugu Telangana rice millers Telugu News Today vigilance raid

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.