తెలంగాణ (Telangana) లో డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ (Telangana Rising Global Summit) ను (TG) రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదేశాల మేరకు, ఈ సదస్సును దావోస్ సమ్మిట్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ తన బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పాలని..
Read Also: Telugu Language: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు: వెంకయ్య నాయుడు
పథకాలను వివరించే స్టాల్స్ ఏర్పాటు
భవిష్యత్ అభివృద్ధికి ప్రాజెక్టులు, వ్యూహాలను రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ పెద్ద కంపెనీలు, 2,000 పైగా వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ సదస్సులో జరిగే ముఖ్య కార్యక్రమాల్లో.. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే మెగా ప్రాజెక్టులు, పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల గురించి నిపుణులతో లోతైన చర్చలు ఉంటాయి. ప్రభుత్వ శాఖల పనితీరు, ప్లాన్లు, పథకాలను వివరించే స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. వివిధ రంగాల నిపుణులతో ముఖా ముఖి సంభాషణలు, చర్చా వేదికలు ఉంటాయి.

ఉచిత ప్రవేశం
ఈ సందర్భంగా.. తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెబుతూ.. డిసెంబర్ 10 నుంచి 13 వరకు ఈ సమ్మిట్‌కు సామాన్యులకు సైతం ఉచిత ప్రవేశం కల్పించింది. ఈ తేదీల్లో ప్రజలందరూ ఈ వేడుకలను సందర్శించవచ్చు. ఈ నాలుగు రోజులు రోజంతా మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు.
సామాన్యుల సౌలభ్యం కోసం, ప్రభుత్వం ప్రతిరోజూ ఎంజీబీఎస్ (MGBS), జేబీఎస్ (JBS), కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్‌బీ నగర్ వంటి ముఖ్య ప్రాంతాల నుండి ప్రత్యేక ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేసింది. ఈ సౌకర్యంతో ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మిట్‌ను సందర్శించవచ్చు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: