📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: ఇంటర్ విద్యార్ధులకు ‘వెల్​​కమ్​కిట్​’ ఇవ్వనున్న రేవంత్

Author Icon By Saritha
Updated: February 3, 2026 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధుల కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్ధులకు వెల్​​కమ్​కిట్​ అందజేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా యూనిఫాం, నోట్స్, లెసన్​, వర్క్​బుక్స్ అందజేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే జూన్​1న తరగతుల ప్రారంభం రోజే వాటిని విద్యార్థులకు అందించేందుకు ఇంటర్​విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందు కోసం దాదాపు రూ 70 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం (Government) అమలు చేస్తున్న సమగ్ర శిక్షా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అమలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్​కళాశాలలుండగా వాటిలో ప్రస్తుతం చదువుతున్న 1.80 లక్షల మంది ఇంటర్​విద్యార్థులు ఈ కిట్​ద్వారా లబ్ధి పొందనున్నారు.

Read Also: Jaggareddy: మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

Revanth Reddy will be giving ‘welcome kits’ to intermediate students.

(TG) విద్యార్థులకు కిట్స్​అందించాలన్న ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదం లభిస్తే వెంటనే టెండర్లు జారీ చేసే కాలేజీలు రీ ఓపెన్ అయ్యే సమయానికి కిట్లు సిద్దం చేయాలని అధికారులు భావిస్తున్నారు. గురుకుల జూనియర్​ కళాశాలల్లో చదివే వారికి సర్కారు ఇప్పటికే ఏకరూప దుస్తులను అందిస్తున్నారు. అయితే, ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు మాత్రం అందటం లేదు.

ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్ధుల తల్లి తండ్రుల పైన భారం లేకుండా ఉండేలా ఈ ప్రతిపాదనలు చేసారు. ఈ వెల్ కం కిట్స్ ద్వారా ఇంటర్​విద్యార్థులకు సైతం రెండు జతల యూనిఫామ్​దుస్తులు, పలు రకాల పుస్తకాలను అందించనున్నారు. అందులోనే పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో పీఎం పోషణ్‌ (మధ్యాహ్న భోజన పథకం) కు రూ.12,750 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.250 కోట్లు మాత్రమే అధికం గా ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:


Education Policy government junior colleges intermediate students Latest News in Telugu Telangana Telugu News Welcome Kit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.