హైదరాబాద్ : (TG) ఏడాదిన్నరగా ఆపరిష్కతంగా వున్న తమ డిమాండల్ల సాధనకు విశ్రాంత ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన విశ్రాంత ఉద్యోగులు తమకు ప్రభుత్వం (Government) నుంచి రావలసిన బకాయిల కోసం కదం తొక్కారు. పెద్ద సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు నాంపల్లి, బషీర్ బాగ్ నుంచి అసెంబ్లీ వైపుకు వచ్చెందుకు యత్పంచగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు బలవతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించారు.
Read also: Jogu Ramanna arrest : రైతుల కోసం నిరసన, తెల్లవారుజామున మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్
బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
తమను అరెస్టు చేస్తున్న(TG) సమయంలో విశ్రాంత ఉద్యోగులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమ అరెస్టు అన్యాయమని, సర్కారు తమ ను మోసం చేసిందని వాపోయారు. 30 నుంచి 40 ఏళ్ల పాటు ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో పనిచేసిన వారు పదవీ విరమణ చేశాక న్యాయం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఇచ్చేందుకు సర్కారు నిరాకరణ దారుణమని తెలిపారు. ఏడాదిన్నరగా దీనిపై అనేక రూపాలో పోరాటం ప్రభుత్వంలో చేసినా చలనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.
అనేక మంది విశ్రాంత ఉద్యోగులు అనారోగ్యం పాలైతే వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారని, ఇందులో కొందరు చనిపోయారని ఆయన తెలిపారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని ఇప్పటికైనా విడనాడి, తమకు రావాలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల విషయంలో సర్కారు ఇదే విధం గా నిర్లక్ష్యం కొనసాగిస్తే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఆందోళనకారులను పలు పోలీసు స్టేషన్లకు తరలించి రాత్రి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: