తెలంగాణ (TG) 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. కాగా, 2015 నోటిఫికేషన్‌కు సంబంధించి.. 2019లో టీజీపీఎస్సీ (TGPSC) ఇచ్చిన సెలక్షన్ లిస్ట్‌ను ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: MLC Mahesh Kumar: బిసి రిజర్వేషన్ ను అడ్డుకొంటున్న బిజెపి
ఉత్తర్వులను సస్పెండ్
అయితే ఈ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. గురువారం (నవంబర్ 27) ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మరో ఆరు వారాలకు వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: