Latest News: TG: గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట

Read Time:  1 min
Latest News: TG: గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట
FONT SIZE
GET APP

తెలంగాణ (TG) 2015 గ్రూప్​-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. కాగా, 2015 నోటిఫికేషన్‌కు సంబంధించి.. 2019లో టీజీపీఎస్సీ (TGPSC) ఇచ్చిన సెలక్షన్ లిస్ట్‌ను ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: MLC Mahesh Kumar: బిసి రిజర్వేషన్ ను అడ్డుకొంటున్న బిజెపి

TG: Relief for Group 2 rankers in the High Court
TG: Relief for Group 2 rankers in the High Court

ఉత్తర్వులను సస్పెండ్‌

అయితే ఈ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. గురువారం (నవంబర్ 27) ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మరో ఆరు వారాలకు వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.