మొంథా తుఫాన్ ప్రభావం తెలంగాణలో(TG Red Alert) కూడా తీవ్రంగా కనిపిస్తోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HYD IMD) తెలిపిన ప్రకారం, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Read Also: TG Rain Alert:మూడు జిల్లాల్లో పాఠశాలకు సెలవులు
జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు (TG Red Alert)కురుస్తాయని హెచ్చరించింది. వర్షాల ప్రభావంతో కొన్ని తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తుఫాన్ దాటే వరకు అనవసర ప్రయాణాలు చేయకుండా, ఎక్కడ అవసరం ఉంటే అక్కడే ఉండాలని, విద్యుత్ వైర్లకు దగ్గరగా వెళ్లకూడదని సూచనలు జారీ అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: