Latest News: TG Rains – తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు

Read Time:  1 min
TG Rains
TG Rains
FONT SIZE
GET APP

తెలంగాణ రాష్ట్రం గత కొన్ని రోజులుగా వరుణుడి ఆగ్రహం చూసింది. జూన్ నెలలో సాధారణంగా వర్షపాతం నమోదవగా, జూలై చివరి వారానికి చేరుకునే సరికి వర్షాలు క్రమంగా పెరిగాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అయితే మరింత తీవ్రంగా కురుస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ప్రభావితం చేశాయి. రోడ్లు ముంచెత్తడం, వంతెనలపైకి వరద నీరు రావడం, గ్రామాలు, పట్టణాల్లో నీటిమునిగిన పరిస్థితులు తలెత్తడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) మరోసారి రాష్ట్ర ప్రజలకు వర్షపు హెచ్చరికలు జారీ చేసింది.

TG Rains
TG Rains

నాలుగు రోజులపాటు తెలంగాణలో ఎడతెరిపి లేకుండా

నేటి నుంచి రానున్న నాలుగు రోజులపాటు తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Read hindi news:  hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/by-elections-for-those-seats-within-9-months-ktr/telangana/546852/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.