అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ, వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో రెండు రోజులు ఇదే స్థితిలో కొనసాగుతుందని, ఆ తర్వాత దాని కదలిక దిశను బట్టి వాయుగుండంగా మారవచ్చని అంచనా వేశారు.ఇదే సమయంలో అరేబియా సముద్రం (Arabian Sea) లో మరో అల్పపీడనం కూడా రూపుదిద్దుకుంటుందని, అది కూడా క్రమంగా బలపడే సూచనలు ఉన్నాయని చెప్పారు. రెండు ప్రాంతాల్లోనూ వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండటంతో, తీరప్రాంత రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావం కారణంగా వచ్చే వారం రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా ఆగస్టు 5 నుంచి 7 తేదీల మధ్య భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని తెలిపారు.నేడు రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత మధ్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడతాయన్నారు. రాత్రి 9 గంటల వరకు అక్కడక్కడ జల్లులు కొనసాగే అవకాశం ఉందని అన్నారు.
తేలికపాటి వర్షాలు
హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని.. ఉదయం, మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం తర్వాత వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. నేడు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, యాదాద్రి, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వర్షం ఎలా ఏర్పడుతుంది?
సముద్రాలు, నదులు, చెరువుల నుండి నీరు ఆవిరై మేఘాలుగా మారి, చల్లటి గాలులతో సాంద్రీకరించబడిన తర్వాత నీటి బిందువుల రూపంలో కురుస్తుంది.
వర్షం ఎన్ని రకాలుగా ఉంటుంది?
తేలికపాటి వర్షం, మోస్తరు వర్షం, భారీ వర్షం, వడగండ్ల వర్షం, నిరంతర వర్షం వంటి రకాలుగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: