हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

TG Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

Anusha
TG Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు, అల్పపీడనాలు,ద్రోణి ప్రభావం కారణంగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించింది.వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం ప్రస్తుత ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ బెంగాల్‌లోని గంగానది, దాని పరిసర ప్రాంతాల మీదుగా అల్పపీడన ప్రాంతంతో అనుసంధానించబడిన ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది. ఇది దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ – యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి.

ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగం కలిగిన ఈదురుగాలులతో (gusty winds) కూడిన అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

TG Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
TG Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

పిడుగులు పడే ఛాన్స్ ఉందని

దక్షిణ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.వర్షం అంచనాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరములు, మెరుపులతో పాటు పిడుగులు (thunderbolts) పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దన్నారు. పొలం పనులు చేసేవారు సైతం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. చిన్న పిల్లలు, వృద్ధులు, బాలింతలు, ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వర్షం దాని ప్రాముఖ్యత ఏమిటి?

వర్షం అనేది వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి గడ్డకట్టడం వల్ల ఏర్పడే నీటి బిందువులు భూమిపై పడే ప్రక్రియ. ఇది ప్రకృతిలో జరిగే ఒక సహజమైన నీటి చక్రంలో భాగం. వర్షం వల్ల భూమికి తాజా నీరు అందుతుంది, ఇది మానవ జీవితానికి అత్యంత అవసరం.

వర్షం రకాలేంటి?

వర్షం మూడు ప్రధాన రకాలుగా విభజించబడుతుంది. అవే:ఉష్ణ వర్షం (Convectional Rainfall),పర్వత వర్షం / ఉపరితల వర్షం (Orographic or Relief Rainfall), చక్రవాత వర్షం / ముఖవాత వర్షం (Cyclonic or Frontal Rainfall).

Read hindi news: hindi.vaartha.com

Read Also: KTR: గుజరాత్ వంతెన ప్రమాదంపై స్పందించిన కేటీఆర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870